Site icon NTV Telugu

YS Jagan: నేడు పాలకొండకు వైసీపీ అధినేత వైఎస్ జగన్!

Ys Jagan

Ys Jagan

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల మృతి చెందిన పాలకొండ వైసీపీ నేత పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు పాలకొండ చేరుకోనున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించనున్నారు. పరామర్శ అనంతరం పాలకొండ నుంచి నేరుగా బెంగుళూరుకు వెళ్లనున్నారు.

ఇటీవల వైసీపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ పాలవలస రాజశేఖరం (81) అనారోగ్యంతో కన్నుమూశారు. రాజశేఖరం మృతి విషయాన్ని విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు.. వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకువెళ్లారు. రాజశేఖరం కుమారుడు పాలవలస విక్రాంత్‌, కుమార్తె శాంతిని జగన్‌ ఫోన్‌లో పరామర్శించారు. రాజశేఖరం మృతికి సంతాపం తెలిపారు. గురువారం నేరుగా రాజశేఖరం ఇంటికి వెళ్లి.. ఆయన కుటుంబాన్ని జగన్‌ పరామర్శించనున్నారు. మంగళవారం విజయవాడ జిల్లా జైలులో వల్లభనేని వంశీని ములాఖత్‌లో జగన్‌ కలిశారు. నిన్న గుంటూరు మిర్చి యార్డ్‌లో రైతులతో సమావేశం అయ్యారు.

Exit mobile version