నేడు కడప జిల్లాకు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రానున్నారు. సొంత నియోజవర్గంలో నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు బెంగళూరు నుంచి కడపకు జగన్ చేరుకోనున్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం జగన్ టూర్ మొదలవుతుంది. ఈ నెల 27న సాయంత్రం తిరిగి బెంగళూరుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ వెళ్లిపోతారు.
24 షెడ్యూల్:
వైఎస్ జగన్ మంగళవారం ఉదయం 11 గంటలకు బెంగళూరు నుంచి ఇడుపులపాయ చేరుకుని దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం ప్రేయర్ హాల్‌లో జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొంటారు. ఆ తర్వాత కడప నియోజకవర్గ నాయకులతో సమావేశమవుతారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు ఇడుపులపాయ నుంచి పులివెందుల బయలుదేరి వెళ్లి రాత్రికి అక్కడ నివాసంలో బస చేస్తారు.
25 షెడ్యూల్:
ఉదయం 8.30 గంటలకు క్రిస్మస్ సందర్భంగా సీఎస్‌ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో వైఎస్ జగన్ పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.30 గంటలకు తాతిరెడ్డిపల్లిలో రామాలయాన్ని ప్రారంభించి.. పులివెందుల చేరుకుని రాత్రికి బస చేస్తారు.
26 షెడ్యూల్:
పులివెందుల క్యాంప్ ఆఫీస్‌లో వైఎస్ జగన్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజాదర్భార్ నిర్వహిస్తారు.
27 షెడ్యూల్:
ఉదయం 9 గంటలకు పులివెందుల విజయా గార్డెన్స్‌లో జరగనున్న వివాహానికి వైఎస్ జగన్ హాజరవుతారు. అనంతరం బయలుదేరి బెంగళూరు వెళతారు.