NTV Telugu Site icon

YS Jagan: నేడు కర్నూలుకు మాజీ సీఎం వైఎస్ జగన్‌!

Cm Ys Jagan

Cm Ys Jagan

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ బుధవారం (డిసెంబర్ 18) కర్నూలుకు రానున్నారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్‌ సురేందర్‌ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌ వేడుకల్లో జగన్‌ పాల్గొంటారు. బెంగుళూరు నుంచి ప్రత్యేక విమానంలో కర్నూలు చేరుకోనున్నారు. ఉదయం 10 గంటలకు బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి.. 11.55 గంటలకు కర్నూలు ఏపీఎస్‌పీ గ్రౌండ్స్‌ హెలిపాడ్‌కు వైఎస్‌ జగన్‌ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బళ్లారి చౌరస్తా మీదుగా కర్నూలు నగర శివారులో ఉన్న జీఆర్‌సీ కన్వెన్షన్‌కు చేరుకుంటారు.

తెర్నేకల్‌ సురేందర్‌ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌లో వైఎస్‌ జగన్‌ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు తిరిగి ఏపీఎస్‌పీ గ్రౌండ్స్‌కు చేరుకుని.. హెలికాప్టర్‌లో తాడేపల్లికి బయలుదేరుతారు. తాడేపల్లిలో పలువురు వైసీపీ నేతలతో వైఎస్‌ జగన్‌ సమావేశం కానున్నారని తెలుస్తోంది. వైఎస్‌ జగన్‌ కర్నూలు పర్యటన నేపథ్యంలో ఏపీఎస్‌పీ క్యాంప్‌లోని ఏర్పాటు చేసిన హెలిపాడ్‌ను వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి మంగళవారం పరిశీలించారు. బందోబస్త్ కోసం స్థానిక పోలీసు అధికారులతో అయన మాట్లాడారు.

 

Show comments