NTV Telugu Site icon

YS Jagan: ముగిసిన సమీక్షా సమావేశం.. వైఎస్‌ జగన్‌ కీలక నిర్ణయం

Jagan

Jagan

YS Jagan: వైసీపీ నేతలతో పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్షా సమావేశం ముగిసింది.. ఈ భేటీకి సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసిన వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు హాజరయ్యారు.. అరగంట పాటు కొనసాగిన ఈ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు వైఎస్‌ జగన్.. ప్రజలకు ఎంతో చేశాం.. ఇన్ని చేసిన తర్వాత.. ఇలాంటి ఫలితాలు చూసిన తర్వాత బాధ అనిపించిందన్నారు.. ఫలితాలు చూసిన తర్వాత శకుని పాచికల కథ గుర్తుకు వచ్చింది.. శకుని పాచికల మాదిరిగా ఎన్నికల ఫలితాలు వచ్చాయని.. కానీ, ఆధారాలు లేకుండా మాట్లాడలేం అన్నారు.. శకుని పాచికలు అనే సబ్జెక్ట్‌ కేవలం ఇంటర్వెలే.. శ్రీకృష్ణుడు తోడు ఉన్నా.. పాండవులు ఓడిపోతారు.. కానీ, ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు..

ఇక, కొన్ని కొన్ని చోట్ల అవమానాలు, ఆస్తుల నష్టాలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో నేను కార్యకర్తలను కలుసుకుంటాను. నష్టపోయిన ప్రతి కార్యకర్తనూ కలిసి వారికి భరోసానిచ్చే కార్యక్రమం చేస్తాను అన్నారు వైఎస్ జగన్.. కాలం గడుస్తున్న కొద్దీ చంద్రబాబుపై కోపం వస్తుంది.. మన పట్ల అభిమానమూ వ్యక్తం అవుతుంది. మళ్లీ మనం రికార్డు మెజార్టీలో గెలుస్తామనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అందరికీ భరోసా ఇవ్వండి. వీరిని బెదిరించే కార్యక్రమాలు, జోరుగా ప్రలోభాలు జరుగుతున్నాయి. రాజీనామాలు చేయాలని బెదిరిస్తున్నారు. మీమీ నియోజకవర్గాల్లో కార్యకర్తలను, నాయకులను పిలిచి పెట్టండి. నాలుగేళ్లవరకూ కూడా అవిశ్వాసం పెట్టే అవకాశం లేదని సూచించారు.

మరోవైపు.. 12 కోట్ల మంది ఓటర్లు ఏపీలో ఉన్నారు. దాదాపు సగానికిపైగా అక్కచెల్లెమ్మలు ఉన్నారు. 1500 లు ప్రతి ఒక్కరికీ ఇస్తానని చెప్పారు.. ఇందులో పెన్షన్లు తీసుకునేవాళ్లని పక్కనిపెట్టినా సరే.. మిగిలిన 1.8 కోట్లమంది ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు వైఎస్‌ జగన్.. పెట్టుబడి సహాయంకోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అమ్మ ఒడిగా కింద వచ్చే డబ్బులు కోసం వారు ఎదురుచూస్తున్నారు. ఏవీ కూడా అడుగులు ముందుకుపడని పరిస్థితి. కాలం గడుస్తున్నకొద్దీ.. హనీమూన్‌ పీరియడ్‌ ముగిస్తుంది అంటూ కూటమి ప్రభుత్వంపై సెటైర్లు వేశారు మాజీ సీఎం, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.