Site icon NTV Telugu

YS Jagan: సాక్షాత్తూ పోలీసుల ప్రోద్బలంతో రిగ్గింగ్ చేశారు..

Ys Jagan

Ys Jagan

వైఎస్సార్‌ జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు మంగళవారం ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. నిన్న జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఎన్నికల సంఘానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మాట్లాడుతూ.. “రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనపడటం లేదు.. ప్రజాస్వామ్యం లేని పరిస్తితుల్లో ఉంది అనటానికి నిన్న జరిగిన ఎన్నికలే ఉదాహరణ.. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పార్టీకి సంబంధించిన ఏజెంట్లు లేకుండా ఎన్నికలు జరిపారు.. 15 బూతుల్లో కూడా వైసీపీ ఏజెంట్లు లేరు.. బూత్ దగ్గరకు కూడా వెళ్లలేని పరిస్థితి..

Also Read:BR Gavai: వీధి కుక్కల తీర్పుపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ కీలక ప్రకటన

సాక్షాత్తూ పోలీసుల ప్రోద్బలంతో రిగ్గింగ్ చేశారు.. మన రాష్ట్రంలో తప్ప దేశంలో ఎక్కడా ఇలా ఉండదు.. ఏజెంట్లు లేకపోతే దొంగ ఓట్లు ఎవరు గుర్తిస్తారు.. వచ్చిన వారిని గుర్తించటం.. తనిఖీ చేయటం.. సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేయటం పోలింగ్ ఏజెంట్ బాధ్యత.. భాద్యతలు ఉంటాయి కాబట్టే ఏజెంట్లకు బూత్ లలో కూర్చునే హక్కు ఉంటుంది.. పోలింగ్ ఏజెంట్ బూత్ లోకి వెళ్లగానే ఫారం 12 తీసుకుని వెళ్ళి ప్రిసైడింగ్ అధికారికి ఇస్తారు.. మా ఏజెంట్ల దగ్గర నుంచి పోలీసులు, టీడీపీ వాళ్ళు లాక్కుని చింపివేశారు.. అసలు ఏజెంట్లు లేకుండా ఎన్నికలు జరగటం నేను చూడలేదు” అంటూ మండిపడ్డారు.

Exit mobile version