Former CM YS Jagan: రాష్ట్రంలో నకిలీ మద్యం వ్యవస్థీకృత పద్ధతిలో అమ్ముతున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు.. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రసంగించారు. ఇలాంటి మాఫియా ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ చూసి ఉండరన్నారు.. ఏకంగా నకిలీ మద్యం ఫ్యాక్టరీలు నడుపుతున్నారని ఆరోపించారు.. వాళ్ళ మనుషులకు ఏ రకంగా షాపులు వచ్చాయి.. వాళ్ళు ఎలా నడుపుతున్నారు అందరూ చూస్తున్నారన్నారు.. గ్రామాల్లో ఆక్షన్ వేసి బెల్ట్ షాపులు నడుపుతున్నారని.. బెల్ట్ షాపులతో పాటు ఇల్లీగల్ పర్మిట్ రూముల ద్వారా విచ్చలవిడిగా కల్తీ మధ్య విక్రయిస్తున్నారని ఆరోపించారు.. వీళ్ల జేబులు నింపుకోవడానికి దిగజారి వ్యాపారం చేస్తున్నారన్నారు.. పెద్దఎత్తున మద్యం, స్పిరిట్ డంపులు దొరికాయి. దొరికిన వాటితో లక్షల లీటర్ల మద్యం దొరికేదని అభిప్రాయపడ్డారు.. సీపీ పర్యవేక్షణలో పోలీసులు పనిచేస్తున్నారన్నారు..
READ MORE: Ram Charan – Upasana : మరోసారి తండ్రి కాబోతున్న రామ్ చరణ్.. ఉపాసన సీమంతం వేడుకలో మెగా హంగామా!
ఏ సీపీ అయితే తప్పుడు పద్ధతిలో పనిచేస్తున్నారో అదే సీపీ పర్యవేక్షణలో ఉన్న ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం దొరికిందని మాజీ సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో మిగిలిన పలుచోట్ల మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డాయి.. రాష్ట్రంలో కొన్ని లక్షల బాటిళ్లు తయారు చేసేది వెళ్ళే.. వీళ్ల మాఫియా ద్వారా పంపిణీ చేసేది వీళ్లే అన్నారు.. డబ్బుల కోసం దిగజారి రాజకీయం చేస్తున్నారు. వాటాల్లో తేడా రావడంతో ఇదంతా బయటకు వచ్చిందన్నారు. నకిలీ మద్యానికి కూడా వాళ్ళ ఇష్టం వచ్చిన కంపెనీల పేరుతో లేబుల్స్ వేస్తున్నారని.. వాళ్ళ మనుషుల ద్వారా వాళ్ళ షాపుల్లో విక్రయిస్తున్నారన్నారు.. రాష్ట్రంలో పలుచోట్ల లక్షల బాటిళ్ల మద్యం దొరికినా చోద్యం చూస్తున్నారని విమర్శించారు. ప్రతీ నాలుగైదు బాటిళ్లకు ఒక బాటిల్ కల్తీ మద్యం అమ్ముతున్నారన్నారు.. ఆశ్చర్యం కలిగించేలా తయారు చేసి అమ్మకాలు జరపటం మిగతా ఎక్కడా సాధ్యం కాదు.. ఇలా ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయటం చంద్రబాబు, లోకేష్ కే సాధ్యమని తీవ్ర ఆరోపణలు చేశారు.. డబ్బుల దగ్గర తగాదా వచ్చి బయటకు రావటంతో డైవర్షన్స్ చేస్తున్నారని.. దీన్నుంచి డైవర్ట్ చేయటానికి మా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు..
READ MORE: Rajasthan: పెట్రోల్ పంప్ కార్మికుడిని చెంపదెబ్బ కొట్టిన మేజిస్ట్రేట్.. అసలేం జరిగిందంటే..!
“చంద్రబాబే నేరాలు చేస్తాడు.. ఆయన దొంగల ముఠా ప్రచారం చేస్తారు.. ఎదుట వాళ్ల మీద కొత్త కొత్త ఆరోపణలు నిజం చేయాలని ఒక సిట్ కూడా వేస్తారు.. ఇదేంటని ప్రశ్నిస్తే వాళ్లను కూడా జైళ్లకు పంపించే ప్రయత్నం చేస్తారు.. నకిలీ మద్యం వెనుక ఉన్నది తంబళ్లపల్లె టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి జయచంద్రారెడ్డి.. మరోవ్యక్తి జయచంద్రారెడ్డి పక్కనే ఉన్న జనార్ధనరావు.. మరో వ్యక్తి కట్టా సురేంద్ర నాయుడు.. ఇదంతా ఇక మాఫియా.. జనార్ధనరావు విదేశాల్లో ఉండగానే రెండు రోజుల్లో లొంగిపోతాడు అని వీళ్లే లీకులు ఇస్తారు.. జనార్ధనరావు తో ముందుగానే వీళ్లు చెప్పినట్లుగా ఒక స్కెచ్ గీయించారు.. మావల్ల మీద బురద చల్లే ప్రయత్నం చేశారు.. జయచంద్రారెడ్డి వైసీపీ నేత పెద్దిరెడ్డి సన్నిహితుడు అని ప్రచారం చేశారు.. ఇవన్నీ టీడీపీ అఫిషియల్‌గా ట్వీట్ చేసింది.. జనార్ధనరావు తో ఒక వీడియో చేయించి ప్రచారం చేస్తున్నారు.. జోగి రమేష్ చాట్ లీక్స్ అంటూ మరికొన్ని వదిలారు.. నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీలు బయటపడ్డ తర్వాత మీరు ఎన్ని ఎన్ని షాపుల్లో తనిఖీలు చేశారు.. ఇదే జనార్ధనరావు విదేశాల నుంచి వస్తున్నాడు అని తెలిసినప్పుడు ముందుగా వెళ్ళి ఎందుకు అరెస్ట్ చేయలేదు.. జనార్ధనరావు నా ఫోన్ పోయింది అని చెప్పాడు.. అసలు ఆ వీడియోలో ఎలా మాట్లాడాడు.. ఎలా పంపాడు.. దాంట్లో చాట్స్ కూడా తయారుచేసి పంపటం ఎలా సాధ్యం. నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీ అక్టోబర్ 3న బయటపడితే నిందితుడు అంటున్న టీడీపీ నేత జయచంద్రారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు.. ఎందుకు ఆయన పాస్ పోర్ట్ సీజ్ చేయలేదు.. రెండున్నరేళ్ల ముందు నుంచి ఇలాంటి కార్యకలాపాలు చేస్తుంటే మీరు అసలు సీటు ఎందుకు ఇచ్చారు.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు మీద జయచంద్రారెడ్డి ని పోటీ పెట్టారు.. జయచంద్రారెడ్డి ఎలక్షన్ అఫిడవిట్ లో కూడా ఆఫ్రికా మద్యం వ్యాపారం గురించి చెప్పాడు.. చంద్రబాబుకు ఇవన్నీ ఎప్పుడు కనిపించలేదా.. పాలకొల్లులో కల్తీ మద్యం ఎవరిది.. ఏలూరు, అమలాపురం, పరవాడ, నెల్లూరు, రేపల్లెలో పట్టుబడ్డ కల్తీ మద్యం ఎవరిది..” అని మాజీ సీఎం వైఎస్ జగన్ నిలదీశారు..
