Site icon NTV Telugu

YS Jagan: వైఎస్ జగన్‌కు ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఫోన్‌.. ఏమన్నారంటే?

Jagan

Jagan

YS Jagan: ఉప రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఫోన్ చేసి మద్దతు కోరగా, జగన్ తన నిర్ణయాన్ని ఆయనకు స్పష్టంగా తెలియజేశారు.

Telangana Assembly News: తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించాలని ప్రయత్నిస్తున్నారు: సీఎం రేవంత్ రెడ్డి

ఇప్పటికే ఎన్డీఏ నాయకులు తమతో సంప్రదించారని, ముందుగానే వారికి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చామని జగన్ తెలిపారు. అంతేకాకుండా వ్యక్తిగతంగా సుదర్శన్ రెడ్డిని ఎంతో గౌరవిస్తాను. ఆయన న్యాయవ్యవస్థ ద్వారా ప్రజలకు అపారమైన సేవలు అందించారు. కానీ, మేము ముందే ఎన్డీఏకు మాట ఇచ్చినందున.. ఎన్నికల్లో మద్దతు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.

Jagapathi Babu: అనుష్క స్వీటీ కానీ ఈ సినిమాలో మాత్రం చాలా ఘాటు!!

అలాగే ఈ విషయంలో అపార్థం చేసుకోవద్దని, తన నిర్ణయాన్ని అన్యధాభావంగా తీసుకోవద్దని జగన్ విజ్ఞప్తి చేశారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఆయన స్పష్టమైన ధోరణి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Exit mobile version