NTV Telugu Site icon

YS Bharathi Election Campaign: వైఎస్‌ భారతికి పులివెందుల బాధ్యతలు..

Bharathi

Bharathi

YS Bharathi Election Campaign: సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌లో హీట్‌ పెంచుతున్నాయి.. ఇప్పటికే ప్రచార పర్వంలో నేతలు దూసుకుపోతుండగా.. ఇవాళ్టితో నామినేషన్ల ప్రక్రియ పూర్తి కానుండడంతో.. మరింత విస్తృతంగా ప్రచారం చేసేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.. ఇక, సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల అసెంబ్లీ స్థానం బాధ్యతలను.. ఆయన సతీమణి వైఎస్‌ భారతికి అప్పగించారు.. నేటి నుండి వారం రోజులపాటు పులివెందులలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు వైఎస్‌ భారతి.. రాష్ట్ర రాజకీయాలలో ముఖ్యమంత్రి బిజీగా ఉన్న నేపథ్యంలో పులివెందుల బాధ్యతలు భారతి చేపట్టనున్నారు.. 2014, 2019 ఎన్నికలలో కూడా పులివెందులలో ఎన్నికల ప్రచార బాధ్యతలు చేపట్టారు భారతి.. ఇక, పులివెందులతోపాటు కడప పార్లమెంట్‌ పరిధిలోనూ పలు నియోజకవర్గాలలో వైఎస్‌ భారతి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారట.. ఈ నేపథ్యంలో.. ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో కలిసి పులివెందులకు చేరుకున్నారు భారతి.. సీఎస్ఐ చర్చ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ముగిసిన తర్వాత ఉదయం 11:25 గంటలకు పులివెందుల అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు సీఎం జగన్‌.. ఈ కార్యక్రమంలో వైఎస్‌ భారతి పాల్గొనే అవకాశం ఉండగా.. ఇక, ఇవాళ్టి నుంచి ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించేందుకు వైఎస్‌ భారతి ప్లాన్‌ చేసుకున్నారు.

Read Also: Samyuktha Menon: సరికొత్త పోజులతో అందాల డోస్‌ పెంచిన సంయుక్త మీనన్..