Site icon NTV Telugu

Naa Anveshana: నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పోతే బాధపడతా అనుకున్నారా బత్తాయిలు.. యూట్యూబర్ అన్వేష్ హాట్ కామెంట్స్ వైరల్

Naa Anvesh

Naa Anvesh

ప్రముఖ యూట్యూబర్ ‘నా అన్వేషణ’ (అన్వేష్) ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ను మెటా యాజమాన్యం తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూట్యూబర్ అన్వేష్ సోషల్ మీడియా వేదికగా హాట్ కామెంట్స్ చేశారు. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే ఏంటీ? పోతే ఏంటీ? నా ఈక అంటూ యూ ట్యూబర్ అన్వేష్ హాట్ కామెంట్స్ చేశారు. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పోతే బాధపడతా అనుకున్నారా బత్తాయిలు అంటూ వ్యంగ్యాస్త్రాలు సందించారు. రెండు ఇన్స్టాగ్రామ్ లు నా రెండు చేతులు, రెండు యూట్యూబ్ ఛానల్లు నా రెండు కాళ్లు, నా ఫేస్బుక్ నా శరీరం భాగం.. ఈ ఐదు భాగాలని నడిపించేది నా తెలివైన బుర్ర అని చెప్పుకొచ్చాడు.

Also Read:Woman Assaulted: పెళ్లి గురించి చర్చ.. యువతిపై లివ్-ఇన్ పార్ట్నర్ దాడి

తెలివైన బుర్ర ఉంది కాబట్టే ఎంతో మందిని నిద్రలేకుండా చేస్తున్నానని అన్వేష్ తెలిపారు. ఒక చెయ్యి లాంటి నా ఇంస్టాగ్రామ్ అకౌంట్ పోయిన మరొక చెయ్యి లాంటి ఇంస్టాగ్రామ్ ఉందన్నాడు. మరొక ఇన్స్టాగ్రామ్ ని తీసేసినా మిగిలిన భాగాలైన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ తో ముందుకు పోతాను అని తెలిపారు. చివరికి నా తలతో అయినా మాట్లాడి ముందుకు వెళ్తాను అని తనను టార్గెట్ చేసే వాళ్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నేను దొరికితే డైరెక్ట్ గా నా తల నరికేయాలి అంటూ సంచలన కామెంట్స్ చేశారు. నేను ఎవరిని దేకను, నేను ఏలాంటి మోసాలు చేయలేదు.. నాకు ఫాలోవర్స్ ఉంటే ఏంటి పోతే ఏంటి.. నిద్ర పట్టనివ్వను, ఎవరిని వదలను అంటూ అన్వేష్ ఫైర్ అయ్యాడు.

Exit mobile version