Site icon NTV Telugu

YouTube: టీనేజర్లకు షాక్.. పేరెంటల్ కంట్రోల్స్, షార్ట్స్ స్క్రోలింగ్‌కు యూట్యూబ్ టైమ్ లిమిట్

Youtbe

Youtbe

YouTube Parental Controls: యూట్యూబ్ ఇప్పటికే పిల్లల డివైస్‌లపై తల్లిదండ్రులు నియంత్రణ పెట్టేందుకు అనేక టూల్స్‌ను అందిస్తోంది. తాజాగా, టీనేజ్ పిల్లల వీక్షణ అలవాట్లపై మరింత నియంత్రణ కల్పించేలా కొత్త ఫీచర్లను గూగుల్‌కు చెందిన ఈ వీడియో ప్లాట్‌ఫామ్ తీసుకొచ్చింది. ముఖ్యంగా యూట్యూబ్ షార్ట్స్‌ను టీనేజర్లు ఎంతసేపు స్క్రోల్ చేయవచ్చో పరిమితి విధించే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. అలాగే, వయసుకు తగిన కంటెంట్‌ను ప్రోత్సహించేలా కొత్త సూత్రాలు, క్రియేటర్ గైడ్‌ను కూడా రిలీజ్ చేసింది. పిల్లల కోసం కొత్త అకౌంట్లు సులభంగా క్రియేట్ చేసుకునేలా అప్‌డేటెడ్ సైన్-అప్ అనుభవాన్ని కూడా యూట్యూబ్ అందించనుంది.

Read Also: Junior NTR New Look: జూనియర్ ఎన్టీఆర్ స్టైలిష్ లుక్.. నెట్టింట ఫోటోలు వైరల్!

ఇక, తాజాగా విడుదల చేసిన బ్లాగ్ పోస్ట్‌లో యూట్యూబ్ ఈ కొత్త అప్‌డేట్స్ వివరాలను వెల్లడించింది. ఇకపై తల్లిదండ్రులు తమ పిల్లలు యూట్యూబ్ షార్ట్స్‌ను ఎంతసేపు చూడాలో స్పష్టంగా లిమిట్ పెట్టొచ్చు. త్వరలో షార్ట్స్ ఫీడ్‌ను పూర్తిగా ‘జీరో’కి సెట్ చేసే ఛాన్స్ ఉందని యూట్యూబ్ పేర్కొనింది. అవసరాన్ని బట్టి ఒక రోజు పూర్తిగా షార్ట్స్‌ను ఆపేయడం లేదా వినోదం కోసం గరిష్టంగా 60 నిమిషాల వరకు అనుమతించే అవకాశం ఉంది. 15 నిమిషాలు, 30 నిమిషాలు, 45 నిమిషాలు, 1 గంట లేదా 2 గంటలుగా షార్ట్స్ టైమ్‌ను సెట్ చేసుకోవచ్చు. అంతేకాదు, సూపర్వైజ్డ్ యూట్యూబ్ అకౌంట్లలో బెడ్‌టైమ్, ‘టేక్ ఎ బ్రేక్’ రిమైండర్లను కూడా కస్టమైజ్ చేసుకునే ఛాన్స్ ఉంది.

Read Also: ED vs TMC: సుప్రీంలో మమతా vs ఈడీ లాయర్ల మధ్య వాదోపవాదాలు.. ఎన్నికల ముందే సోదాలెందుకని టీఎంసీ క్వశ్చన్

అయితే, టీనేజర్లకు ఉపయోగకరమైన కంటెంట్‌ను అందించడమే లక్ష్యంగా కొత్తగా క్రియేటర్ గైడ్‌ను యూట్యూబ్ ప్రవేశ పెట్టింది. ఈ క్రమంలో ఖాన్ అకాడమీ, క్రాష్‌కోర్స్, టెడ్-ఎడ్ లాంటి విద్యాపరమైన వీడియోలను టీనేజర్లకు ఎక్కువగా సూచించనుంది. ఈ సూత్రాలను యూత్ అడ్వైజరీ కమిటీ, యూసీఎల్‌ఏకి చెందిన సెంటర్ ఫర్ స్కాలర్స్ అండ్ స్టోరీటెల్లర్స్‌తో కలిసి రూపొందించామని యూట్యూబ్ వెల్లడించింది. అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్, బోస్టన్ చిల్డ్రెన్స్ హాస్పిటల్‌కు చెందిన డిజిటల్ వెల్‌నెస్ ల్యాబ్ సహా పలు అంతర్జాతీయ సంస్థల నిపుణులు దీనికి సపోర్టు ఇచ్చారు. రాబోయే వారాల్లో అప్‌డేటెడ్ సైన్-అప్ విధానంతో టీనేజర్లను ఆటోమేటిక్‌గా అండర్-18 ప్రొటెక్టెడ్ అకౌంట్లలోకి తీసుకువచ్చేలా, తల్లిదండ్రులు మొబైల్ యాప్‌లోనే సులభంగా అకౌంట్ల మధ్య మారేలా యూట్యూబ్ ఈ కొత్త మార్పులను అమలు చేయనుంది.

Exit mobile version