Site icon NTV Telugu

Youtube: క్రియేటర్లకు గుడ్ న్యూస్.. కొత్త యాప్ తీసుకుస్తున్న యూట్యూబ్

Youtube

Youtube

Youtube New App Youtube Create:  యూట్యూబ్ క్రియేటర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు ఒక వీడియోను రూపొందించాలంటే చాలా సమయం పడుతుంది. రికార్డింగ్, ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఇలా చాలా చేసిన తరువాతే ఒక వీడియో బయటకు వస్తుంది. అయితే ఇప్పుడు ఈ పనులు అన్నింటిని తేలిక చేసేయనుంది యూట్యూబ్. దీని కోసం యూట్యూబ్ క్రియేట్ పేరిట కొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ఆధునిక టెక్నాలజీ ఆర్టిఫిషియల్‌ ఎంటిలిజెన్స్‌ (AI)కు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో దాని ద్వారా వీడియోస్ ను క్రియేట్ చేసే విధంగా యాప్ ను రూపొందించనున్నారు. దీని ద్వారా వీడియోలను చాలా సులభంగా రూపొందించవచ్చు. ఈ విషయాన్ని  గూగుల్‌మాతృ సంస్థ అల్ఫాబెట్‌  సీఈవో  సుందర్‌ పిచాయ్‌  కూడా  ఎక్స్‌ (ట్విటర్‌)లోప్రకటించారు.

Also Read: One Nation One Election: ఒకే దేశం, ఒకే ఎన్నికపై కమిటీ తొలి సమావేశం.. ఈ అంశాలపై చర్చించే అవకాశం

వీడియో క్రియేట్‌లో ప్రెసిషన్ ఎడిటింగ్ , ట్రిమ్మింగ్, క్యాప్షనింగ్ , ఆటోమేటిక్ వాయిస్‌ఓవర్, ట్రాన్సిషన్స్ వంటి ఫీచర్లు ఉంటాయని కంపెనీ బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. చాట్ బాక్స్‌లో  మనం అనుకున్నది  టైప్ చేయడం చేస్తే   AI- దానంతటకదే వీడియో లేదా చిత్రాన్ని జోడించేలా ‘డ్రీమ్ స్క్రీన్’ అనే కొత్త ఫీచర్‌ను టెస్ట్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. దీని ద్వార కేవలం టాపిక్ కు సంబంధించినవే కాకుండా ట్రెండింగ్ లో ఉన్న విషయాలకు సంబంధించిన వీడియోలు, ఇమేజ్ లు ఆటోమేటిక్ గా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఫస్ట్‌టైం యూట్యూబ్‌ వీడియోలు  చేస్తున్నవారికి మరింత అందుబాటులో ఉండేలా చేయడమే తమ లక్ష్యమని కంపెనీ తెలిపింది. టిక్‌టాక్ మాదిరిగానే బీట్ మ్యాచింగ్ టెక్నాలజీతో ఉండే రాయల్టీ ఫ్రీ మ్యూజిక్‌ను కూడా ఇందులో వినియోగదారులు వాడుకోవచ్చు. ఇక ఈ యాప్ ఉచితంగా లభిస్తుంది. ఇందులో ఫీచర్లను మనం ఎటువంటి డబ్బులు చెల్లించకుండానే ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం ఈ యాప్ కొరియా, ఇండోనేసియా, సింగపూర్, భారత్ సహా కొన్ని మార్కెట్లలో ఆండ్రాయిడ్ బీటా యూజర్లలకు అందుబాటులో ఉంది. ఇక వచ్చే ఏడాది నుంచి ఈ యాప్ ను ఐవోఎస్ యూజర్లకు కూడా ప్రవేశపెట్టనున్నట్లు యూట్యూబ్ తెలిపింది.

Exit mobile version