Gun Fire : కుక్క పెట్టిన చిచ్చు.. మహిళను తుపాకీతో కాల్చిన అల్లుడు కాని అల్లుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gun Fire : దేశ రాజధాని ఢిల్లీలోని దేశ్ బంధు గుప్తా రోడ్ ప్రాంతంలో ఓ వ్యక్తి తన ప్రియురాలి తల్లిని తుపాకీతో కాల్చాడు. ఈ ఘటన శనివారం జరగింది. గాయపడిన మహిళను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మహిళ పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు సమాచారం. కాల్చిన వ్యక్తి ఓ యువతితో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నాడు. ఇంతలో కుక్క విషయమై బాలిక తల్లితో గొడవ పడ్డాడు. గొడవ తీవ్రస్థాయికి చేరడంతో సహనం కోల్పోయి ప్రియురాలి తల్లిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. మహిళను కాల్చిన తర్వాత అతను భయంతో పారిపోయాడు. పోలీసులు అతని కోసం వెతుకుతున్నారు.
Read Also: Student : టీచర్‌ను చంపేందుకు స్టూడెంట్ మాస్టర్ ప్లాన్.. కత్తి పట్టుకుని
Also Read
- Donald Trump: "ఆ గౌరవం దక్కించుకున్న ఏకైక యూఎస్ ప్రెసిడెంట్ నేనే".. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై ట్రంప్ ఫిదా!
- Venezuela Earthquake: వెనెజువెలాను మళ్లీ వణికించిన భూకంపం.. ప్రజల్లో భయాందోళనలు
- TTD: రామ మందిరం విరాళాల వివాదం ఎఫెక్ట్.. టీటీడీ ఖాతాలకు టెక్నాలజీ అప్‌గ్రేడ్.! ఖాతాలకు టెక్నాలజీ అప్‌గ్రేడ్..
- CM Chandrababu Markapuram Tour: రూ.300 కోట్ల పరిహారం పంపిణీకి సీఎం.. మార్కాపురం జిల్లాలో నేడు విస్తృత పర్యటన
ఈ ఘటనపై పోలీసులు సమాచారం ప్రకారం.. ఏప్రిల్ 8(శనివారం)న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని గౌషాలా రోడ్‌లోని ధోబివాలి గాలి వద్ద కాల్పులు జరిగినట్లు తమకు సమాచారం అందిందని తెలిపారు. వెంటనే పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. మహిళ భుజంపై కాల్చినట్లు తేలింది. మహిళ వయస్సు 40ఏళ్లు. ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. ఆమె పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపగా, ఆ మహిళ.. అలోక్ అలియాస్ ప్రిన్స్‌తో కలిసి లివ్ఇన్లో నివసిస్తున్నట్లు తేలింది. శనివారం చిన్న సమస్యపై వారి మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత ఆమె తల్లి మధ్యవర్తిత్వం వహించడానికి అక్కడికి చేరుకుంది. ఇంతలో అలోక్ పేల్చిన బుల్లెట్ ఆమె భుజానికి తగిలింది. ఈ మేరకు ఐపీసీ సెక్షన్ 307, ఆయుధ చట్టం 25/27 కింద కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న అలోక్‌ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
తాజావార్తలు
-
Donald Trump: “ఆ గౌరవం దక్కించుకున్న ఏకైక యూఎస్ ప్రెసిడెంట్ నేనే”.. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై ట్రంప్ ఫిదా!
-
Venezuela Earthquake: వెనెజువెలాను మళ్లీ వణికించిన భూకంపం.. ప్రజల్లో భయాందోళనలు
-
Vivo X Fold 6: 200MP కెమెరా, 7000mAh బ్యాటరీతో వివో ఎక్స్ ఫోల్డ్ 6 విడుదల.. ఫోల్డబుల్ ఫోన్లలో కొత్త బెంచ్‌మార్క్
-
TTD: రామ మందిరం విరాళాల వివాదం ఎఫెక్ట్.. టీటీడీ ఖాతాలకు టెక్నాలజీ అప్‌గ్రేడ్.! ఖాతాలకు టెక్నాలజీ అప్‌గ్రేడ్..
-
CM Chandrababu Markapuram Tour: రూ.300 కోట్ల పరిహారం పంపిణీకి సీఎం.. మార్కాపురం జిల్లాలో నేడు విస్తృత పర్యటన
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!