Site icon NTV Telugu

Gun Fire : కుక్క పెట్టిన చిచ్చు.. మహిళను తుపాకీతో కాల్చిన అల్లుడు కాని అల్లుడు

Dog

Dog

Gun Fire : దేశ రాజధాని ఢిల్లీలోని దేశ్ బంధు గుప్తా రోడ్ ప్రాంతంలో ఓ వ్యక్తి తన ప్రియురాలి తల్లిని తుపాకీతో కాల్చాడు. ఈ ఘటన శనివారం జరగింది. గాయపడిన మహిళను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మహిళ పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు సమాచారం. కాల్చిన వ్యక్తి ఓ యువతితో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నాడు. ఇంతలో కుక్క విషయమై బాలిక తల్లితో గొడవ పడ్డాడు. గొడవ తీవ్రస్థాయికి చేరడంతో సహనం కోల్పోయి ప్రియురాలి తల్లిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. మహిళను కాల్చిన తర్వాత అతను భయంతో పారిపోయాడు. పోలీసులు అతని కోసం వెతుకుతున్నారు.

Read Also: Student : టీచర్‎ను చంపేందుకు స్టూడెంట్ మాస్టర్ ప్లాన్.. కత్తి పట్టుకుని

ఈ ఘటనపై పోలీసులు సమాచారం ప్రకారం.. ఏప్రిల్ 8(శనివారం)న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని గౌషాలా రోడ్‌లోని ధోబివాలి గాలి వద్ద కాల్పులు జరిగినట్లు తమకు సమాచారం అందిందని తెలిపారు. వెంటనే పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. మహిళ భుజంపై కాల్చినట్లు తేలింది. మహిళ వయస్సు 40ఏళ్లు. ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. ఆమె పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపగా, ఆ మహిళ.. అలోక్ అలియాస్ ప్రిన్స్‌తో కలిసి లివ్‌ఇన్‌లో నివసిస్తున్నట్లు తేలింది. శనివారం చిన్న సమస్యపై వారి మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత ఆమె తల్లి మధ్యవర్తిత్వం వహించడానికి అక్కడికి చేరుకుంది. ఇంతలో అలోక్ పేల్చిన బుల్లెట్ ఆమె భుజానికి తగిలింది. ఈ మేరకు ఐపీసీ సెక్షన్ 307, ఆయుధ చట్టం 25/27 కింద కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న అలోక్‌ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Exit mobile version