Site icon NTV Telugu

Guntur: గుంటూరు జిల్లాలో బ్రెయిన్ డెడ్ అయిన యువతి మృతి

Guntur

Guntur

Guntur: గుంటూరు జిల్లాలోని తెనాలిలో నవీన్ అనే యువకుడు దాడి లో తీవ్ర గాయాలపాలై బ్రెయిన్ డెడ్‌కు గురైన సహానా మృతి చెందింది. గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతూ సహానా ప్రాణాలు విడిచింది. మృతురాలు సహానాకు నిందితుడు నవీన్‌కు ప్రేమ వ్యవహారం ఉంది. ఈ నేపథ్యంలో నవీన్ వల్ల సహానా గర్భం దాల్చింది. ఈ నేపథ్యంలో గత శనివారం నిందితుడు నవీన్ సహానాను కారులో తెనాలి శివారు ప్రాంతానికి తీసుకువెళ్లాడు.

Read Also: Drishyam Style Murder: “దృశ్యం” తరహాలో ప్రియురాలిని హత్య చేసిన ఆర్మీ జవాన్..

ఈ క్రమంలోనే సహానా తాను గర్భవతిని అని, తనని పెళ్లి చేసుకోవాలని నవీన్‌ను కోరింది. దీంతో ఇద్దరి మధ్య మాట పెరిగి, సహానాను కారు బానెట్‌కు వేసి బలంగా కొట్టాడు నవీన్. తీవ్రంగా దాడి చేయడంతో సహానా కోమాలోకి వెళ్లిపోయింది. బ్రెయిన్ డెడ్ అయింది. ఈ నేపథ్యంలో నిందితుడు నవీన్‌ను తెనాలి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే గడిచిన మూడు రోజులుగా సహానాకు గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. అయితే ఈ సాయంత్రం ఆమె గుండె పని చేయటం ఆగిపోవడంతో సహానా మృతి చెందినట్లు ప్రభుత్వ వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం సహానా మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ మార్చురీకి తరలించారు.

Exit mobile version