Site icon NTV Telugu

Mahabubabad: బాత్రూమ్ క్లీనర్ తాగి యువతి ఆత్మహత్యాయత్నం..

Harika

Harika

మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పిన్ని రెడ్డిగూడెం గ్రామానికి చెందిన గుగులోత్ హారిక బాత్రూమ్ క్లీనర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు అంబులెన్స్ కు ఫోన్ చేశారు. అయితే సమయానికి అంబులెన్స్ రాకపోవడంతో సెలైన్ బాటిల్ పెట్టించుకొని బంధువులు బైక్ పై ఖమ్మం హాస్పిటల్ కు బయలుదేరారు. మార్గమధ్యలో అంబులెన్స్ రావటంతో హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం హారిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. హారికకు తల్లిదండ్రులు లేకపోవడంతో బాబాయ్ సంరక్షణలో ఉంటున్నట్లు తెలిసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version