సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు యువకుడిని హత్య చేసి ఇంటి ముందు పడేశారు. జయప్రకాష్ (22) అనే యువకుడిని హత్య చేసి శవాన్ని ఇంటి ముందు పడేశారు. మృతుడు మేస్త్రి వర్క్ చేస్తూ జీవిస్తున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోల్ చెందిన వ్యక్తిగా గుర్తింపు. బొల్లారం మున్సిపల్ కెబిఆర్ కాలనిలో నివసిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Sangareddy: బొల్లారం మున్సిపల్ పరిధిలో దారుణం.. యువకుడిని హత్య చేసి ఇంటి ముందు పడేసిన గుర్తు తెలియని వ్యక్తులు
- IDA బొల్లారం KBR కాలనిలో జయప్రకాష్ (22) అనే యువకుడు దారుణ హత్య
- హత్య చేసి శవాన్ని ఇంటి ముందు పడేసి వెళ్లిన గుర్తు తెలియని దుండగులు
- మేస్త్రి పని చేస్తున్న ఏపీలోని ఒంగోలు జిల్లాకి చెందిన జయప్రకాష్
- ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Murder