Site icon NTV Telugu

Theft: యువకుడిని పొద్దంతా చెట్టుకు తలక్రిందులుగా వేలాడదీసి.. కారణం అదే!

Young Man

Young Man

ఒక యువకుడు మొబైల్ ఫోన్ దొంగిలించాడని ఆరోపిస్తూ, కొంతమంది యువకులు అతని కాళ్ళను తాడుతో కట్టి చెట్టుకు తలక్రిందులుగా వేలాడదీశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది. ఈ సంఘటన ఘుగ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘఘ్రౌవా ఖదేసర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు ఐదుగురు నిందితులపై కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేశారు.

Also Read:Komatireddy Venkat Reddy : ఫాం హౌస్ నుండే వస్తలేడు.. అధికారంలోకి ఎలా వస్తాడు

ఘగ్రౌవాలోని ఖదేసర్ నివాసి అయిన బాధితుడి తల్లి సహానా తన ఫిర్యాదులో పోలీసులకు తెలిపింది. మొబైల్ దొంగతనం ఆరోపణపై గ్రామ నివాసితులు నయీమ్, సాహిల్, క్రిష్, గోలు, విశాల్ తన కొడుకును పట్టుకున్నారని, అతని కాళ్ళు కట్టి, ఉదయం నుండి సాయంత్రం వరకు చెట్టుకు తలక్రిందులుగా వేలాడదీశారని ఆమె తెలిపింది. కనికరమే లేకుండా విచక్షణా రహితంగా కొట్టారని ఆరోపించింది. తన కొడుకుకు తీవ్ర గాయాలు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఐదుగురు నిందితులపై ఘుగ్లి పోలీసులు కేసు నమోదు చేసినట్లు అదనపు పోలీసు సూపరింటెండెంట్ సిద్ధార్థ తెలిపారు. నిందితుల్లో ఇద్దరు నయీమ్, సాహిల్‌లను అరెస్టు చేశారు. మిగతా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు.

Exit mobile version