Site icon NTV Telugu

Google Search Trends: ధోని, కోహ్లీ, రోహిత్ కాదు.. గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసింది ఇతడ్నే!

Dhoni

Dhoni

Google Search Trends: టీమిండియా స్టార్ బ్యాటర్లు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీరి గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు 2019లో రిటైర్మెంట్ ప్రకటించినప్పటికి క్రేజ్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. ఐపీఎల్‌లో ధోనీ ఆట కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో వేచి చూస్తుంటారు. అదే విధంగా రో-కో ద్వయం కూడా కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతుండటంతో వారిని ఆరాధించేవారు కూడా ప్రస్తుతం చాలా మందే ఉన్నారు. కానీ, 2025 ఏడాదిలో వీరి ముగ్గురుని ఓ యంగ్ క్రికెటర్ అధిగమించేశాడు. అతడి గురుంచి తెలుసుకోవడానికి నెటిజన్స్ గూగుల్‌లో తెగ సెర్చ్ చేశారు. అతడే భారత అండర్‌-19 ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ.

Read Also: Hyderabad: సోమాజిగూడ లోని శ్రీకన్య కంఫర్ట్ రెస్టారెంట్ లో అగ్నిప్రమాదం..

అయితే, 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఈ సంవత్సరం గూగుల్‌లో భారత్‌లో అత్యధికంగా వెతికిన వ్యక్తిగా నిలిచాడు. ఇతను ఐపీఎల్, ఇండియా ‘ఎ’మ్యాచ్‌లు, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలలో అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. దీంతో అతడి గురుంచి తెలుసుకునేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపించారు. వైభవ్ 12 ఏళ్ల వయస్సలోనే ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించాడు. ఇక, గూగుల్ ఇయర్ ఇన్ సెర్చ్ 2025 నివేదిక ప్రకారం.. వైభవ్ మొదటి స్ధానంలో ఉండగా మరో యువ క్రికెటర్ పంజాబ్ కింగ్స్ ప్లేయర్ ప్రియాన్ష్ ఆర్య రెండో స్థానంలో నిలిచాడు. వీరిద్దరి తర్వాత అభిషేక్ శర్మ, షేక్ రషీద్ ఉన్నారు. అలాగే, మహిళల ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవడంలో కీ రోల్ పోషించిన జెమీమా రోడ్రిగ్స్ గురుంచి కూడా ఎక్కువ మంది నెటిజన్లు గూగుల్ లో సెర్చ్ చేశారు.

Exit mobile version