Site icon NTV Telugu

Parineeti Chopra: పరిణీతి ఈజ్‌ బ్యాక్‌.. ఆ ఊహాగానాలకు చెక్‌!

Parineeti Chopra

Parineeti Chopra

Parineeti Chopra on Amar Singh Chamkila Movie: ప్రముఖ పంజాబీ గాయకుడు అమర్‌ సింగ్ చంకీల జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘అమర్‌ సింగ్‌ చంకీల’. ఇంతియాజ్‌ అలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పంజాబీ నటుడు దిల్జిత్‌ దొసాంజ్‌, బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా ప్రధాన పాత్రల్లో నటించారు. ఏప్రిల్‌ 12న నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా విడుదలైన ఈ సినిమాపై ప్రశంసలు కురుస్తున్నాయి. అంతేకాదు పరిణీతి పోషించిన అమర్‌జోత్ కౌర్ పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. తన పాత్రకు ప్రేక్షకుల నుంచి వస్తోన్న రెస్పాన్స్‌పై పరిణీతి తాజాగా స్పందించారు.

అమర్‌ సింగ్‌ చంకీల సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తోన్న స్పందన చూస్తుంటే తనకు చాలా సంతోషంగా ఉందని పరిణీతి చోప్రా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘అమర్‌ సింగ్‌ చంకీల సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తోన్న స్పందన చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఆనందంతో కన్నీళ్లు ఆగడం లేదు. పరిణీతి ఈజ్‌ బ్యాక్‌.. అనే మాటలు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్నాయి. ఇది నేను అస్సలు ఊహించలేదు. అవును నేను తిరిగొచ్చేశా, ఎక్కడికీ వెళ్లను’ అని పరిణీతి ఎక్స్‌లో పేర్కొన్నారు.

Also Read: Nagarjuna: కొత్త దర్శకులతో నాగార్జున!

గతేడాది ఆప్‌ యువ నాయకుడు రాఘవ్‌ చద్ధాను పరిణీతి చోప్రా ప్రేమ వివాహం చేసుకొన్నారు. పెళ్లి తర్వాత ఆమె సినిమాలకు బై బై చెపుతారని నెట్టింట ప్రచారం జరిగింది. తాజా పోస్ట్‌తో ఆ ఊహాగానాలకు పరిణీతి చెక్‌ పెట్టారు. 2011లో విడుదలైన ‘లేడీస్ వర్సెస్‌ రికీ బహ్ల్’తో పరిణీతి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. కిల్‌ దిల్‌, డిష్యూం, గోల్‌మాల్‌ అగైన్‌, కేసరి, సైనా వంటి హిట్ చిత్రాలతో నటిగా తానేంటో నిరూపించుకున్నారు.

Exit mobile version