Kurnool MP Seat: కర్నూలు ఎంపీ అభ్యర్థిపై ఈరోజు వైసీపీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకోనుంది. కర్నూలు మేయర్ బీవై రామయ్యను ఇప్పటికే తాడేపల్లి సీఎం క్యాంపు ఆఫీసుకు వైసీపీ అధిష్టానం పిలిపించింది. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బీవై రామయ్య పేరును ఇప్పటికే ఖరారు చేసింది. మంత్రి జయరాంను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినా.. ఆయన నిరాకరించడంతో బీవై రామయ్య పేరును అధిష్టానం ఖరారు చేసింది.
ఈరోజు సీఎం వైఎస్ జగన్‌ను కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపికైన ఇంతియాజ్ అహ్మద్ కలవనున్నారు. ఇంతియాజ్ అహ్మద్‌తో పాటు బీవై రామయ్య కూడా సీఎంను కలవనున్నారు. బీవై రామయ్య, ఇంతియాజ్ అహ్మద్‌కు సీఎం జగన్ దిశా నిర్ధేశం చేయనున్నారు. చాలా ఉత్కంఠ తర్వాత కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది.