Site icon NTV Telugu

YCP PAC: నేడు వైసీపీ పీఏసీ తొలి సమావేశం.. నేతలకు దిశానిర్ధేశం చేయనున్న వైఎస్ జగన్!

Ys Jagan

Ys Jagan

నేడు వైసీపీ పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సమావేశం జరగనుంది. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఉదయం 10.30 గంటలకు పీఏసీ తొలి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పీఏసీ సభ్యులు హాజరుకానున్నారు. పీఏసీ సమావేశంలో పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.

ఇటీవల వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు పార్టీ పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీని పూర్తిస్థాయిలో పునర్వ్యవస్థీకరించిన విషయం తెలిసిందే. 33 మందిని పీఏసీ సభ్యులుగా నియమించారు. పార్టీ స్టేట్‌ కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణా రెడ్డి పీఏసీ కో-ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. నేటి సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. పార్టీ భవిష్యత్ కార్యచరణపై వైఎస్‌ జగన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. జిల్లాల్లో పార్టీ పరిస్థితి, పార్టీ బలోపేతం సహా కూటమి సర్కార్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై భవిష్యత్తులో పోరాటాలపై పీఏసీ చర్చించనుంది.

Exit mobile version