YCP MLA Jakkampudi Raja Comments on CM YS Jagan: అధిష్టానం ఆదేశిస్తే తాను రాజమండ్రి ఎంపీగా పోటీ చేస్తా అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. అధిష్టానం నుంచి ఎటువంటి ప్రతిపాదన లేదని, రాజమండ్రి పార్లమెంట్ టికెట్ కాపులకు ఇవ్వాలని భావిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశిస్తే ఎక్కడి నుంచి అయినా తాను పోటీకి సిద్ధం అని జక్కంపూడి రాజా తెలిపారు. నా రాజకీయ భవితవ్యం సీఎం జగన్ చేతుల్లోనే ఉందని.. సీఎం చెట్టు ఎక్కమన్నా, నీటిలో దూకమన్నా తాను సిద్ధంగా ఉన్నా అని పేర్కొన్నారు.
Also Read: Mary Kom Retirement: నేను ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు: మేరీ కోమ్
తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో ఎమ్మెల్యే జక్కంపూడి మాట్లాడుతూ… ‘వైసీపీ రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేస్తా. ఇంతవరకు అధిష్టానం నుంచి ఎటువంటి ప్రతిపాదన లేదు. రాజమండ్రి పార్లమెంట్ వైసీపీ టికెట్ కాపులకు ఇవ్వాలని భావిస్తున్నారు. రాజకీయంగా జక్కంపూడి ఫ్యామిలీకి పేరు ఉండటం వల్ల నా పేరు ప్రస్తావిస్తున్నారు. నా పేరు పరిశీలనలో ఉండవచ్చు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశిస్తే ఎక్కడి నుండైనా పోటీకి సిద్ధం. నా రాజకీయ భవితవ్యం సీఎం జగన్ చేతుల్లోనే ఉంది. జగన్ చెట్టు ఎక్కమన్నా, నీటిలో దూకమన్నా సిద్ధం’ అని చెప్పారు.