Site icon NTV Telugu

Yatra 2 : ‘యాత్ర 2’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..

Whatsapp Image 2024 01 02 At 5.59.25 Pm

Whatsapp Image 2024 01 02 At 5.59.25 Pm

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 2004 ఎన్నికలకు ముందు చేసిన పాదయాత్ర ఆధారంగా గతంలో యాత్ర మూవీ తెరకెక్కింది.2019 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో విడుదల అయిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రానికి మహీ వి.రాఘవ్ దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్మూట్టి రాజశేఖర రెడ్డి పాత్రలో అద్భుతంగా పోషించారు. ఇప్పుడు, యాత్ర చిత్రానికి సీక్వెల్‍గా యాత్ర 2 మూవీ తెరకెక్కుతుంది.2019 ఎన్నికలకు ముందు రాజశేఖర రెడ్డి తనయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‍మోహన్ రెడ్డి చేసిన సుదీర్ఘ పాదయాత్ర అలాగే ఆయన ముఖ్యమంత్రిగా గెలిచిన కథాంశంతో ‘యాత్ర 2’ మూవీ రూపొందుతోంది. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‍మోహన్ రెడ్డి పాత్రను యాత్ర 2లో తమిళ నటుడు జీవా పోషిస్తున్నారు.ఈ ఏడాది ఫిబ్రవరి 8న ఈ మూవీ విడుదల కానుంది.ఈ క్రమంలో యాత్ర 2 టీజర్ రిలీజ్ డేట్ అండ్ టైమ్‍ను మూవీ యూనిట్ ఖరారు చేసింది.

యాత్ర 2 సినిమా టీజర్ జనవరి 5వ తేదీన ఉదయం 11 గంటలకు విడుదల కానుంది. ఈ విషయాన్ని దర్శకుడు మహీ వి.రాఘవ్ వెల్లడించారు. టీజర్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ ను ట్వీట్ చేశారు. ఈ పోస్టర్‌లో మమ్మూటి (రాజశేఖర రెడ్డి) కుర్చీలో కూర్చొని ఉండగా.. జీవా (జగన్) ఆయన వెనుక నిలబడ్డారు. యాత్ర 2 చిత్రంలో వైఎస్ భారతిగా కేతకి నారాయణ్ మరియు సోనియా గాంధీ పాత్రలో జర్మనీ నటి సుజానే బెర్నెట్ నటిస్తున్నారు. మహేశ్ మంజ్రేకర్ మరియు రాజీవ్ కుమార్ అనేజా కీలకపాత్రలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. వీ సెల్యూలాయిడ్, త్రీ ఆటమ్ లీవ్స్ పతాకాలపై శివ మేకల మరియు మహి వి.రాఘవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు ఫిబ్రవరి 8న యాత్ర 2 వస్తుండటంతో రాజకీయంగానూ ఈ చిత్రం ఎంతో కీలకంగా మారింది.

Exit mobile version