Yatra 2 Trailer: ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘యాత్ర’. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘యాత్ర 2’ ఫిబ్రవరి 8న విడుదల కానుంది. వైఎస్‌ఆర్ తనయుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా నాయకుడిగా ఎదుగుతున్న నేపథ్యంలో సాగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ‘యాత్ర 2’ తెరకెక్కనుంది. మహి వి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వైఎస్సార్, అతని కొడుకు జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించబడింది. ఇప్పటికే విడుదలైన యాత్ర-2 టీజర్, పాటలు సినీ ప్రేక్షకులతో పాటు వైఎస్ఆర్ అభిమానుల హృదయాలను హత్తుకున్నాయి. తాజాగా యాత్ర 2 ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్.
Read Also:D. Sridhar Babu: అపోలో క్యాన్సర్ ఆసుపత్రిలో ‘విక్టరీ బెల్’.. ప్రారంభించిన శ్రీధర్ బాబు
దేశంలో ఇప్పటి వరకు ఎంతో మంది ప్రముఖుల జీవితాలపై ఎన్నో బయోపిక్‌లు వచ్చినా.. వాటన్నింటికీ దక్కని క్రేజ్ యాత్ర సీక్వెల్ కి దక్కింది. ఇంతలా యాత్ర-2కు ఆదరణ పెరగడానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాన కారణం. దేశంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న ముఖ్యమంత్రులలో వైఎస్ జగన్ ఒకరు. ఆయనో దూకుడు రాజకీయ నాయకుడు, మాస్ లీడర్, ప్రజల నుంచి పుట్టిన పార్టీ అధినేత. అందుకే ఆయన నిజ జీవితాన్ని మరోసారి వెండితెరపై చూడాలని కోట్లాది మంది అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
Read Also:Tehsildar Ramanaiah Case: తహశీల్దార్ రమణయ్య హత్య కేసు.. దర్యాప్తులో సంచలన నిజాలు
‘యాత్ర 2’ సినిమాలో వైయస్ జగన్, భారతి దంపతులుగా జీవా, కేతికా నారాయణ్ నటించారు. వైయస్సార్ పాత్రలో మరోసారి మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేయనున్నారు. త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ సంస్థలతో కలిసి శివ మేక ‘యాత్ర 2’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘యాత్ర’ విడుదలైన ఫిబ్రవరి 8న ‘యాత్ర 2’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. వైఎస్ భారతిగా కేతికా నారాయణన్, సోనియాగా సుజానే పర్ఫెక్ట్ యాప్ట్ అని జనాలు చెబుతున్నారు. జగన్ పాత్రలో జీవా సైతం ఒదిగిపోయారు.
