Site icon NTV Telugu

Yatra 2 : చూడు నాన వీడియో సాంగ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన మేకర్స్..లుక్ వైరల్

Whatsapp Image 2024 01 18 At 6.43.09 Pm

Whatsapp Image 2024 01 18 At 6.43.09 Pm

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాజకీయ చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం యాత్ర..ఈ చిత్రం 2019 సార్వత్రిక ఎన్నికల ముందు రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద విమర్శకుల ప్రశంసలు అందుకుంది.వైఎస్సార్ పాత్ర లో మమ్ముట్టి అద్భుతంగా నటించారు. దీనికి కొనసాగింపుగా యాత్ర 2 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. యాత్ర 2 చిత్రం ప్రస్తుత ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి పొలిటికల్ జర్నీ నేపథ్యంలో తెరకెక్కుతుంది. వై ఎస్ జగన్ పాత్రలో కోలీవుడ్ స్టార్ హీరో జీవా నటిస్తున్నారు.యాత్ర 2 నుంచి ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్‌ పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. మరోవైపు ఇటీవలే లాంఛ్ చేసిన టీజర్‌ సినిమాపై భారీగా అంచనాలు పెంచేస్తుంది.

వైఎస్ జగన్ పాత్ర లో జీవా ఒదిగిపోయారు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక సాంగ్ రిలీజ్ పై మేకర్స్ తాజాగా అప్డేట్ ఇచ్చారు.తండ్రీకొడుకులు మిలియన్ల సంఖ్యలో జనాల మనసులో ఎలాంటి చెరగని ముద్రవేసుకున్నారో తెలిపే ప్రయాణం నేపథ్యంలో సాగే చూడు నాన వీడియో సాంగ్‌ను రేపు ఉదయం 11 గంటలకు లాంఛ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఓదార్పు యాత్రలో ఉన్న తాజా లుక్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.మహి వి రాఘవ్ తెరకెక్కిస్తున్న యాత్ర 2 థియేటర్ల లో 2024 ఫిబ్రవరి 8న గ్రాండ్‌ గా విడుదలవుతుంది. ప్రజా సంక్షేమం కోసం తండ్రి ఆశయ సాధన కోసం వైఎస్‌ జగన్ చేసిన వాగ్దానాలను ఎలా నిలబెట్టుకున్నారనే నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా కేవలం తండ్రీకొడుకుల రాజకీయ జర్నీ నేపథ్యంలోనే ఉండబోతున్నట్టు టాలీవుడ్‌ సర్కిల్‌ సమాచారం. యాత్ర 2 సినిమాను త్రీ ఆటమ్ లీవ్స్ , వీ సెల్యూలాయిడ్ సంయుక్తంగా తెరకెక్కిస్తుండగా సంతోష్‌ నారాయణన్‌ మ్యూజిక్ అందిస్తున్నారు.

Exit mobile version