గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘టాక్సిక్’. యష్ సరసన కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా వంటి స్టార్ హీరోయిన్లు నటిస్తుండటం సినిమాకు మరింత ప్లస్ అయ్యింది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా 1980ల నాటి గోవా డ్రగ్ కార్టెల్ నేపథ్యంలో సాగే గ్రిప్పింగ్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతోంది. వచ్చే ఏడాది మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా కోసం అభిమానులు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓవర్సీస్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి.
Also Read : Peddi : రికార్డ్ స్థాయిలో ‘పెద్ది’ బిజినెస్: ఓవర్సీస్‌లో చరణ్ సరికొత్త చరిత్ర!
ప్రముఖ పంపిణీ సంస్థ ఫార్స్ ఫిల్మ్ (Phars Film) ఈ సినిమా విదేశీ పంపిణీ హక్కులను రికార్డు స్థాయిలో రూ. 105 కోట్లకు (అడ్వాన్స్ రూపంలో) దక్కించుకున్నట్లు సమాచారం. ఇంగ్లీష్ మినహా మిగిలిన అన్ని భారతీయ భాషల (కన్నడ, తెలుగు, హిందీ, తమిళం, మలయాళం) వెర్షన్లు ఈ డీల్‌లో భాగంగా ఉన్నాయి. ఒక సౌత్ ఇండియన్ సినిమాకు, అందునా ఒక కన్నడ చిత్రానికి ఈ స్థాయి రేటు పలకడం ఇదే మొదటిసారి. గ్లోబల్ మార్కెట్‌లో రాకింగ్ స్టార్ యష్‌కి ఉన్న క్రేజ్ ఏంటో ఈ డీల్ స్పష్టం చేస్తోంది. ఇక ఈ చిత్రం ఇప్పటికే తెలుగు రాష్ట్రాల హక్కులను దిల్ రాజు రూ. 120 కోట్లకు సొంతం చేసుకోగా, ఇప్పుడు ఓవర్సీస్ డీల్ కూడా పూర్తి కావడంతో నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్స్ ఖాయమనిపిస్తోంది.
