Site icon NTV Telugu

Yash Dayal: మైనర్‌పై అత్యాచారం.. క్రికెటర్ యశ్‌ దయాళ్‌పై పోక్సో కేసు నమోదు!

Yash Dayal Pocso Case

Yash Dayal Pocso Case

Yash Dayal Booked Under POCSO Act After Rape Minor in Jaipur: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫాస్ట్ బౌలర్ యశ్‌ దయాళ్‌పై మరో కేసు నమోదైంది. క్రికెట్‌లో అద్భుత కెరీర్‌ చూపిస్తానని నమ్మించి.. రెండేళ్లుగా యశ్‌ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని జైపూర్‌కు చెందిన ఓ యువతి ఆరోపణలు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు జైపూర్‌ పోలీసులు యశ్‌ దయాళ్‌పై పోక్సో కేసు నమోదు చేశారు. ఇటీవల ఘజియాబాద్‌కు చెందిన ఒక అమ్మాయి ఆర్సీబీ ఆటగాడిపై ఫిర్యాదు చేసింది. వివాహం పేరుతో యశ్‌ తనను లైంగికంగా వాడుకున్నాడని ఆరోపించింది.

‘ఐపీఎల్‌ మ్యాచ్‌ సందర్భంగా జైపుర్‌లో తొలిసారి యశ్‌ దయాళ్‌ను కలిశా. క్రికెట్ కెరీర్ గురించి మాట్లాడుదామని సీతాపురలోని ఓ హోటల్‌కు నన్ను పిలిచి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆపై నన్ను బ్లాక్‌మెయిల్‌ చేస్తూ.. రెండేళ్ల పాటు పలుమార్లు అత్యాచారం చేశాడు. మంచి క్రికెట్ కెరీర్‌ చూపిస్తానంటూ యశ్‌ నన్ను మోసం చేశాడు’ అని జైపూర్‌ యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. మొదటిసారి అత్యాచారానికి గురైనప్పుడు ఆమె మైనర్. అమ్మాయి వయసు 17 ఏళ్లు కావడంతో.. పోక్సో చట్టం కింద దయాళ్‌పై జైపూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. గాజియాబాద్‌ యువతి కేసు విషయంలో అలహబాద్‌ హైకోర్టును ఆశ్రయించగా.. అరెస్టుపై స్టే విదించిన విషయం తెలిసిందే.

Also Read: GST Fraud: రెస్టారెంట్‌ ఉద్యోగికి రూ.4.60 కోట్ల జీఎస్టీ.. ఫిర్యాదు తీసుకోని హైదరాబాద్ పోలీసులు! చివరకు

యశ్‌ దయాళ్‌ ఐపీఎల్‌ 2022లో గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున ఎంట్రీ ఇచ్చాడు. 2024 నుండి ఆర్సీబీలో భాగంగా ఉన్నాడు. ఆర్సీబీ ఐపీఎల్ 2025లో టైటిల్‌ను గెలవడంతో యశ్‌ ముఖ్యపాత్ర పోషించాడు. 13 వికెట్లు పడగొట్టి జట్టుకు తన సహకారం అందించాడు. అతడికి ఇది రెండో ఐపీఎల్ టైటిల్. 2022లో గుజరాత్ టైటాన్స్‌ టైటిల్ గెలిచిన జట్టులో యశ్‌ సభ్యుడు. ఇప్పటివరకు 43 ఐపీఎల్ మ్యాచులు ఆడిన అతడు 41 వికెట్స్ పడగొట్టాడు.

Exit mobile version