కృష్ణా జిల్లా జిల్లా గన్నవరం మండలం బుద్ధవరం గ్రామంలోని రెండు ఆలయాలకు గన్నవరం నియోజవర్గ టీడీపీ ఇంఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు మూడు లక్షల రూపాయల నగదు విరాళంగా అందజేశారు. గ్రామంలో బుధవారం నాడు ఉదయం శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఆయన స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆలయ అభివృద్ధికి రెండు లక్షల రూపాయలను ఆలయ కమిటీ సభ్యులకు అందించారు.
ఆ తర్వాత ఇటీవల విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్ట జరిగిన శ్రీసీతారామాలయానికి వెళ్లిన గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావ్ శ్రీ సీతారామస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి పనుల కోసం లక్ష రూపాయలను ఆలయ కమిటీ సభ్యులకు అందించారు. రెండు చోట్ల ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు యార్లగడ్డకు స్వామివారి శేష వస్త్రం కప్పి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గూడవల్లి భవానీ ప్రసాద్, గన్నవరం మండల అంగన్వాడి అధ్యక్షురాలు లక్ష్మీ, గ్రామ తెలుగు యువత అధ్యక్షుడు నాగరాజు, గన్నవరం మండల తెలుగు యువత అధ్యక్షుడు శివరామకృష్ణ, గన్నవరం మండల రైతు అధ్యక్షుడు ఆరుమల్ల కృష్ణారెడ్డి, గన్నవరం మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ అభిలాష్, గ్రామ పెద్దలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.