NTV Telugu Site icon

Yarlagadda Venkatarao: 2024లో గన్నవరం నుంచి పోటీ చేయటం ఖాయం

Yarlagadda

Yarlagadda

కృష్ణా జిల్లా గన్నవరంలో వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావ్ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆత్మీయ సమావేశానికి రాకుండా కొందరు బెదిరించారని తెలిపారు. మరోవైపు వైసీపీ అధికారంలో ఉన్న వైసీపీ కార్యకర్తలపై కేసులు తీయలేదని యార్లగడ్డ ఆరోపించారు. జగన్ తమ రాజకీయ భవిష్యత్ కు భరోసా ఇచ్చి గన్నవరం తీసుకువచ్చారని.. తాను రాక ముందు ఇక్కడ పార్టీ పరిస్థితి ఏంటో ఇక్కడ వారికే బాగా తెలుసని యార్లగడ్డ పేర్కొన్నారు.

Natural Star Nani: నాకు తెలిసిన హీరోల్లో పాన్ ఇండియా స్టార్ అంటే అతనే..

అయితే గత ఎన్నికల్లో దురదృష్టం, విధి వంచించటం వల్ల ఓడి పోయానని యార్లగడ్డ పేర్కొన్నారు. టెన్త్ క్లాస్ చదువుకునే రోజుల్లోనే తాను ఎమ్మెల్యే అవ్వాలని అనుకున్నట్లు తెలిపారు. అయితే తాను ఎమ్మెల్యేగా ఓడినా.. పార్టీ అధికారంలో ఉందని నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరిద్దాం అనుకున్నట్లు పేర్కొన్నారు. తాను 2024లో గన్నవరం నుంచి పోటీ చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. వంశీతో తనకు ఎలాంటి తగాదాలు లేవని.. కాదంటే వంశీతో కలిసి పనిచేయలేనన్నట్లు తాను సీఎం జగన్ కి చెప్పానన్నారు. వైసీపీ అభ్యర్ధిగా తాను పోటీ చేయటం వల్లే వంశీకి శత్రువుగా మారానని తెలిపారు. అయితే తనను విజయవాడ ఎంపీకి ఇంఛార్జిగా వెళ్ళాలని పార్టీ పెద్దలు కోరారని.. తాను మాత్రం గన్నవరంలోనే ఉంటానని చెప్పానని అన్నారు. వైసీపీకి తానే ముందు వచ్చానని.., తననే ముందు గుర్తించాలని జగన్ ను కోరుతున్నట్లు యార్లగడ్డ పేర్కొన్నారు.

Pawan Kalyan: పార్టీ నడపడానికి సినిమాలే నాకు ఇంధనం

తనను క్రాస్ రోడ్డులో వదలనన్న జగన్.. ఇప్పుడు నడిరోడ్డు మీద ఉన్నట్లు యార్లగడ్డ ఆరోపించారు. మరోవైపు తనను దుట్టా రామచంద్రరావు డొక్క చించి డోలు కడతారని తిట్టినా పార్టీ స్పందించలేదని తెలిపారు. ఎన్నో అవమానాలు భరించానని.. తాను మాత్రం జగన్ ను ఏమీ అనలేదని పేర్కొన్నారు. అయితే రెండేళ్లుగా తనకు సీఎం దగ్గర నుంచి అపాయింట్ మెంట్ లేదని.. తనకు గన్నవరం టికెట్ ఇవ్వాలని మరోసారి జగన్ ను కోరుతున్నట్లు తెలిపారు. ఇక తన భవిష్యత్ ను గన్నవరం ప్రజలు నిర్ణయిస్తారని యార్లగడ్డ వెంకట్రావ్ పేర్కొన్నారు.