దర్శకుడు ఆదిత్య ధర్ అంటే ఇప్పుడు బాలీవుడ్‌లో ఒక సెన్సేషన్. ఆయన తీసిన ‘ధురందర్’ సినిమా వెయ్యి కోట్ల వసూళ్ల వైపు దూసుకెళ్తోంది. అయితే ఇంత పెద్ద డైరెక్టర్ తన పర్సనల్ లైఫ్‌లో మాత్రం చాలా సింపుల్ అంటోంది అని ఆయన భార్య, హీరోయిన్ యామీ గౌతమ్. అసలు వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలైంది? పెళ్లి వరకు ఎలా వెళ్లింది? అనే విషయాలపై యామీ తాజాగా కొన్ని క్రేజీ విషయాలు పంచుకుంది.
Also Read : Salman Khan-MS Dhoni : బురదలో ఆడుతున్న ధోని, సల్మాన్.. క్రేజీ ఫోటోలు వైరల్..
“మా మధ్య ప్రేమ పుట్టడానికి పెద్దగా కష్టపడలేదు, అసలు ఆదిత్య నాకు ప్రపోజ్ కూడా చేయలేదు. నిజం చెప్పాలంటే మా లవ్ స్టోరీలో ఎలాంటి సినిమా సీన్లు లేవు. ‘యూరి’ సినిమా ప్రమోషన్స్ కోసం తిరుగుతున్నప్పుడే మేం క్లోజ్ అయ్యాం. ఆదిత్యలో నాకు నచ్చిన బెస్ట్ క్వాలిటీ ఏంటంటే.. సెట్‌లో ఆయన ఎవరినీ ఒక్క మాట కూడా అనరు. ఎంత టెన్షన్ ఉన్నా కూల్‌గా హ్యాండిల్ చేస్తారు. ఆ మెచ్యూరిటీ చూశాకే నాకు ఆయనపై గౌరవం పెరిగింది. మా మధ్య ‘ఐ లవ్ యు’ చెప్పుకోవడాలు, ఒకరిని ఒకరు ఇంప్రెస్ చేయడాలు లాంటివి అస్సలు జరగలేదు. మా ఆలోచనలు కలిశాయి, ఇంట్లో వాళ్లకి చెప్పాం.. వాళ్లు ఓకే అన్నారు.. అంతే! ఇక పెళ్లి కూడా హడావిడి లేకుండా కొండల మధ్య ప్రశాంతంగా చేసుకున్నాం. కోవిడ్ లేకపోయినా మేము ఇంతే సింపుల్‌గా పెళ్లి చేసుకునేవాళ్లం’ అని యామీ మనసులో మాట చెప్పేసింది. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.
