Yamaha MT-15 V2.0: ఇండియా మార్కెట్‌లో యామహా మోటార్ కంపెనీ తమ ప్రముఖ స్ట్రీట్‌ఫైటర్ బైక్ అయిన Yamaha MT-15 Version 2.0 యొక్క 2025 మోడల్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ బైక్ ధర రూ.1.69 లక్షల నుంచి రూ.1.80 లక్షల వరకు (ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించబడింది. తాజా మోడల్‌లో కంపెనీ కొత్త కలర్ ఆప్షన్లు, ఆధునిక ఫీచర్లు అందించడంతో రైడింగ్ అనుభవం మరింత మెరుగుపడేలా డిజైన్ చేసింది. మరి ఆ విశేషాలేంటో ఒకసారి చూసేద్దామా..
ఈ కొత్త MT-15లో వచ్చిన ముఖ్యమైన అప్‌డేట్ TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్. ఇది ఇప్పటికే యమహా R15లో ఉపయోగించారు. ఈ TFT డిస్‌ప్లే ద్వారా టర్న్ బై టర్న్ నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు వినియోగదారులకు లభించనున్నాయి. Y-కనెక్ట్ మొబైల్ యాప్ ద్వారా బైక్ పార్కింగ్ లొకేషన్, ఫ్యూయల్ ఖర్చు వివరాలు, మాల్ ఫంక్షన్ అలెర్ట్స్ వంటి అనేక సమాచారం పొందొచ్చు.
Tollywood: తెలుగు మీద కన్నేస్తున్న తమిళ, మలయాళ, కన్నడ హీరోలు
ఇక లుక్ పరంగా చూస్తే.. MT సిరీస్‌కు చిహ్నంగా నిలిచిన డిజైన్ కొనసాగించబడింది. ట్విన్ హెడ్‌లాంప్ డిజైన్, మస్కులర్ ఫ్యూయల్ టాంక్, కాంపాక్ట్ బాడీ బైక్‌కు స్ట్రీట్‌ఫైటర్ లుక్‌ను కల్పిస్తున్నాయి. ఈసారి యామహా కొత్త రంగులు అందించింది. ఐస్ స్టార్మ్, మెటాలిక్ సిల్వర్ సియాన్, మెటాలిక్ బ్లాక్, వివిడ్ వైలెట్ మెటాలిక్ రంగులలో బైక్ లభించనుంది.
ఇక ఇంజిన్ పరంగా చూస్తే, ఈ కొత్త MT-15 వర్షన్ 2.0 బైకులో తన మునుపటి మోడల్‌లానే ఉంటుంది. ఇందులో 155cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఇది 18 hp పవర్, 14 nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్ బాక్స్‌తో పాటు స్లిప్పర్ క్లచ్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కూడా అందించబడింది. ఈ బైక్ ప్రధానంగా హోండా CB హార్నెట్ 2.0, TVS అపాచీ RTR 200 4V మోడల్స్‌కు పోటీగా నిలుస్తుంది. ధరకు తగ్గ ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక కనెక్టివిటీ ఫంక్షన్లతో 2025 యమహా MT-15 V2.0 యువతలో మరింత పాపులారిటీ సాధించే అవకాశముంది. స్టైలిష్ లుక్, స్మార్ట్ టెక్నాలజీ, ఇంజిన్ పనితీరు కోరే వారికి ఇది ఒక మంచి ఎంపిక.
Constable Suicide: కానిస్టేబుల్‌గా క్రిమినల్స్‌తో పోరాడింది.. కానీ భర్త వేధింపులకు బలైంది..?
