Site icon NTV Telugu

Yadadri Bhuvanagiri: హృదయవిదారక ఘటన.. రైలు నుంచి జారిపడి నవ దంపతులు మృతి..

Yadagiri

Yadagiri

Yadadri Bhuvanagiri: యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో హృదయవిదారకర ఘటన చోటు చేసుకుంది. యాదగిరిగుట్ట (మ) వంగపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుంచి జారిపడి నవ దంపతులు మృతి చెందారు. మృతులు ఆంధ్రప్రదేశ్ పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన సింహాచలం, భవానిగా గుర్తించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ బంధువుల ఇంటికి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల ఈ ఇద్దరికి వివాహం జరిగింది. ఇంతలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వరుడు, వధువు గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోస్టుమార్ట్ అనంతరం మృతదేహాలను సొంత గ్రామాలకు తరలించనున్నారు. ఈ ఘటన ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది? అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

READC MORE: Modi-Priyanka Gandhi: మోడీకి నవ్వు తెప్పించిన ప్రియాంకాగాంధీ స్టోరీ.. అసలేం జరిగిందంటే..!

Exit mobile version