Site icon NTV Telugu

Yaber K2S 4K Projector Price: 200 అంగుళాల స్మార్ట్ టీవీ అనుభూతి.. ధర తక్కువ, సూపర్ సౌండ్!

Yaber K2s 4k Projector

Yaber K2s 4k Projector

Yaber K2S 4K Projector Launch and Price In India 2023: ‘యాబెర్’ కంపెనీ భారతదేశంలో తన సరికొత్త కే2ఎస్ 4కే ప్రొజెక్టర్ (Yaber K2S 4K Projector)ను రిలీజ్ చేసింది. ఆరిజిన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో ఈ సరికొత్త ప్రొజెక్టర్‌ను విడుదల చేసింది. భారతదేశంలో యాబెర్ కంపెనీ యొక్క మొదటి ప్రొజెక్టర్ ఇది. 200 అంగుళాల స్మార్ట్ టీవీ మాదిరి ఉండే ఈ ప్రొజెక్టర్‌… డాల్బీ ఆడియో, 4K రిజల్యూషన్‌తో వస్తుంది. ఇది సురక్షితమైన ప్రీమియం అవుట్‌డోర్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొజెక్టర్.

Yaber K2S 4K Projector JBL Speakers:
యాబెర్ కే2ఎస్ 4కే శక్తివంతమైన అవుట్‌డోర్ మూవీ ప్రొజెక్టర్. ఇది గేమర్స్, సినిమా ప్రేమికులు మరియు వ్యాపారవేత్తలకు ఉత్తమమైన ఎంపిక. ఇది 800 ఏఎన్‌ఎస్‌ఐ ల్యూమన్ ప్రొజెక్టర్. 4K UHD రిజల్యూషన్‌తో స్పష్టమైన విజువల్స్‌ను అందిస్తుంది. శక్తివంతమైన అంతర్నిర్మిత స్టీరియో 20W జేబీఎల్ స్పీకర్ సిస్టమ్‌ను ఈ ప్రొజెక్టర్ కలిగి ఉంటుంది. డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో ఈ ప్రొజెక్టర్ గేమర్‌ల కోసం అద్భుతమైన గేమింగ్ ఇంటర్‌ఫేస్‌ను కూడా అందిస్తుంది.

Also Read: Faf du Plessis Catch: డుప్లెసిస్ సెన్సేషనల్ క్యాచ్.. ఈ వయసులోనూ సూపర్ డైవింగ్!

Yaber K2S 4K Projector Specs:
యాబెర్ కే2ఎస్ 4కే ప్రొజెక్టర్ బహుముఖ ప్రొజెక్టర్. అంటే ఎన్నో రకాలుగా దీనిని ఉపయోగించుకోవచ్చు. ఇది 4K UHD వీడియోను ప్రసారం చేయడానికి, గేమ్‌లు ఆడేందుకు మరియు ప్రెజెంటేషన్‌లను ఇవ్వడానికి వీలుగా ఉంటుంది. బ్లూటూత్ స్పీకర్‌గా కూడా పనిచేస్తుంది. మీకు ఇష్టమైన సంగీతాన్ని వినొచ్చు. అలెక్సా వంటి వాయిస్ అసిస్టెంట్‌లకు కూడా అనుకూలంగా ఉంటుంది. అన్నిరకాల మొబైల్ యాప్‌లకు ఈ ప్రొజెక్టర్ మద్దతు ఇస్తుంది. దాంతో మీకు ఇష్టమైన సినిమాలు, టీవీ కార్యక్రమాలు లేదా సంగీతాన్ని చూడవచ్చు, వినొచ్చు.

Yaber K2S 4K Projector Price:
ఈ ప్రొజెక్టర్‌ను ఎక్కడైనా సునాయాసంగా తీసుకెళ్లొచ్చు. ఇది మీ ఇంటిలోని ఏ గదిలోనైనా సునాయాసంగా ఉపయోగించడానికి వీలుగా ఉంటుంది. ఇది ఆటో ఫోకస్ మరియు ఆటో కీస్టోన్ సర్దుబాటును కూడా కలిగి ఉంటుంది. దాంతో మీరు ఏ సమయంలో అయినా బొమ్మను క్లారిటీగా చూడొచ్చు. ఈ ప్రొజెక్టర్‌ 200 అంగుళాల స్మార్ట్ టీవీ అనుభూతిని ఇస్తుంది. ఇది భారతదేశంలో రూ. 54,900కి అందుబాటులో ఉంది. అయితే మీరు దీన్ని Amazon Indiaలో రూ.41,890కి.. originalshop.co.inలో రూ.37,990కి కొనుగోలు చేయవచ్చు.

Also Read: MS Dhoni Bike Collection Video: షోరూమ్‌లో కూడా ఇన్ని బైక్‌లు ఉండవేమో.. ధోనీ కలెక్షన్‌కు బిత్తరపోపోవాల్సిందే!

 

Exit mobile version