Xiaomi Buds 6: షియోమీ (Xiaomi) సంస్థ కొత్తగా ట్రూ వైర్‌లెస్ స్టీరియో (TWS) ఇయర్‌బడ్స్ Xiaomi Buds 6ను చైనాలో అధికారికంగా విడుదల చేసింది. ఇవి గత ఏడాదిలో లాంచ్ అయిన షియోమీ బడ్స్ 5కు అప్డేటెడ్ గా వచ్చాయి. కొత్త Buds 6 మోడల్ సెమీ ఇన్ ఇయర్ డిజైన్ తోపాటు, బియోనిక్ కర్వ్ (Bionic Curve) డిజైన్ ఛార్జింగ్ కేస్ ను కలిగి ఉంది. ఈ కొత్త TWS ఇయర్‌బడ్స్‌లో Harman “Golden Ear” ట్యూనింగ్ ఆడియో అందించడంతో పాటు, హెడ్ ఫోన్స్ 2.0 పేరుతో ప్రత్యేకమైన ఇండిపెండెంట్ రికార్డింగ్ ఫీచర్ ను కూడా అందిస్తున్నారు. ఒక్కో ఇయర్‌బడ్‌లో 35mAh బ్యాటరీ, ఛార్జింగ్ కేస్‌లో 475mAh బ్యాటరీ ఉంది. కంపెనీ ప్రకారం కేస్‌తో కలిపి గరిష్టంగా 35 గంటల బ్యాటరీ బ్యాకప్ అందుతుంది.
చైనాలో Xiaomi Buds 6 ధర CNY 699గా నిర్ణయించారు. ఇవి మూన్ షాడో బ్లాక్, పెరల్ వైట్, టైటానియం గోల్డ్, నెబుల పర్పుల్ రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే చైనాలో Xiaomi అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ద్వారా విక్రయాలు ప్రారంభం అయ్యాయి. ఇవి అడాప్టివ్ యాక్టీవ్ నాయిస్ క్యాన్సలేషన్ (ANC) సపోర్ట్‌ను కలిగి ఉన్నాయి. వీటిలో ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ రేంజ్ 16Hz నుంచి 40,000Hz వరకు ఉంటుంది.
సెమీ ఇన్-ఇయర్ డిజైన్‌తో వచ్చిన ఈ ఇయర్‌బడ్స్ ఒక్కోటి సుమారు 4.4 గ్రాముల బరువు, ఛార్జింగ్ కేస్ బరువు 35.4 గ్రాములుగా ఉన్నాయి. ఈ TWS ఇయర్‌బడ్స్ AAC, SBC, aptX Lossless, aptX Adaptive, LC3 కోడెక్స్ను సపోర్ట్ చేస్తాయి. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.4 ఉంది. ఇది దాదాపు 10 మీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇంకా ఇవి IP54 రేటింగ్తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్‌ను కూడా కలిగి ఉన్నాయి.
