ప్రపంచ కుబేరులలో ఒకరైన ఎఎలాన్ మస్క్ ప్రముఖ ట్విట్టర్ సంస్థను సొంతం చేసుకున్న తర్వాత ఆ కంపెనీలో అనేక మార్పులకు కారణమయ్యాడు. ఉద్యోగుల నుండి ట్విట్టర్ పేరు వరకు అన్నిటిని మార్చుకుంటూ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పాత పేరు ట్విట్టర్ ను తీసేసి ‘ఎక్స్’ గా నామకరణం చేసాడు ఎలాన్ మస్క్. ఇక తాజాగా వీడియో స్ట్రీమింగ్ యూట్యూబ్ కు దీటుగా మరో ప్రత్యేక వేదికను తీసుకురాబోతున్నాడు.
Also Read: T20 World Cup 2024: సంజూ, డీకేలకు నిరాశే.. 15 మందితో కూడిన భారత జట్టు ఇదే!
వినియోగదారులు హై క్వాలిటీ వీడియోలను అప్లోడ్ చేసేందుకు వీలుగా ఓ ప్రత్యేకమైన టీవీ యాప్ ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ఎక్స్ సీఈవో లిండా యాకరినో తెలిపారు. ఈ తరుణంలో చిన్న తెర నుండి పెద్ద తెర వరకు ఎక్స్ అన్నింటిని మార్చుకుంటూ వెళ్తుంది. ఇక కొత్తగా తీసుకురాబోయే టీవీ యాప్ గురించి కంపెనీ అధికారులు మాట్లాడుతూ..
Also Read: Peddireddy Ramachandra Reddy: కుప్పంలో వైసీపీ జెండా ఎగరడం ఖాయం..
ఎక్స్ అన్నిటిని మార్చేస్తుంది. ఎక్స్ టీవీ యాప్ తో కొత్త రకమైన నూతన కంటెంట్ మీ స్మార్ట్ ఫోన్, టీవీలోకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే పెద్ద స్క్రీన్ లపై ప్రొజెక్ట్ చేసినప్పుడు అత్యంత నాణ్యమైన కంటెంట్, అలాగే అందులో లీనమయ్యే విధంగా అనుభవాన్ని ఇచ్చే విధంగా రూపొందించినట్లు తెలిపారు. అందుకు తగ్గట్టుగా యాప్ రెడీ అయిపోతున్నట్లు సీఈవో తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపారు. వీటితోపాటు ఎక్స్ టీవీ యాప్ యూజర్ ఇంటర్ఫేస్, అందుకు సంబంధిత విశేషాలను కూడా ఎలా ఉండబోతున్నట్లు ఓ చిన్న వీడియో రూపంలో కూడా ఆమె సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.