Site icon NTV Telugu

Elon Musk : వేరే మార్గం లేదు..శాన్ ఫ్రాన్సిస్కో నుంచి మకాం మార్చుతున్న ఎక్స్

Elon Musk

Elon Musk

Elon Musk : ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ ఎక్స్ అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నుంచి తన మకాం మార్చబోతుంది. ఈ విషయం తెలిసిన కొద్ది వ్యవధిలోనే వైరల్ అయింది. దీనిపై ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. అమెరికా పశ్చిమ తీరంలోని శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కార్యకలాపాలు కొనసాగించడం కష్టతరంగా మారిందని పేర్కొన్నారు. దీంతో ఎక్స్ ప్రధాన కార్యాలయాన్ని మరో చోటికి తరలించడం తప్ప వేరే మార్గం లేదని స్పష్టం చేశారు. 2006వ సంవత్సరం నుంచి శాన్ ఫ్రాన్సిస్కోలో సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. విద్యుత్ ఆధారిత వాహనాల తయారీ సంస్థ టెస్లా, అంతరిక్ష పరిశోధన యాత్రల సంస్థ స్పేస్ ఎక్స్ లతో పాటు, ఎక్స్ కార్యాలయాన్ని కూడా తరలిస్తామని ఎలాన్ మస్క్ కిందటి నెలలోనే ఉద్యోగులకు ఓ మెయిల్ ద్వారా తెలిపారు.

Read Also:Tollywood: టాలీవుడ్ టాప్ అప్ డేట్స్.. ఒక్క క్లిక్ తోనే..

2006లో ట్విట్టర్ ప్రారంభం అయింది. ఆ తర్వాత ఎలాన్ మస్క్ చేతుల్లోకి వచ్చి ఎక్స్ గా మారే వరకు శాన్ ఫ్రాన్సిస్కోలోనే కొనసాగుతోంది. ముఖ్యంగా, చెల్లింపుల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఎక్స్ ప్రధాన కార్యాలయంతోపాటే స్ట్రైప్, బ్లాక్ (క్యాష్ యాప్) తదితర కార్యాలయాలను కూడా వేరేచోటికి మార్చుతున్నామని మస్క్ చెప్పుకొచ్చారు. ఎక్స్ సీఈవో లిండా యక్కారినో ఇప్పటికే తమ సంస్థ ఉద్యోగులకు కార్యాలయ తరలింపుపై ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించారు. మార్పుకు అందరూ సంసిద్ధం కావాలని సూచించారు.

Read Also:Jammu Kashmir : జమ్మూ కాశ్మీర్‌కు రూ. 1.19 లక్షల కోట్ల జాక్‌పాట్, 4.61 లక్షల మందికి ఉద్యోగాలు!

Exit mobile version