WTC Final 2025: ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఫైనల్ జూన్ 11 నుండి 15, 2025 వరకు లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతుందని.., అలాగే జూన్ 16 రిజర్వ్ డేగా ఉంటుందని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మంగళవారం మీడియాకు తెలియజేసింది. అంటే 2023తో పోలిస్తే ఈసారి IPL ఫైనల్ కు WTC ఫైనల్ కు మధ్య కొంచెం ఎక్కువ గ్యాప్ ఉండవచ్చు. క్వాలిఫికేషన్‌ను నిర్ణయించే పర్సంటేజీ పాయింట్ల ప్రకారం భారత్ ప్రస్తుతం టెస్ట్ స్టాండింగ్‌లలో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. న్యూజిలాండ్ మూడవ స్థానంలో ఉంది.
Imran Khan: హైకోర్టులో ఇమ్రాన్ ఖాన్ పిటిషన్.. సైనిక కస్టడీకి ఇవ్వొద్దని వినతి
లార్డ్స్‌లో జరిగే టెస్ట్ ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మూడవ ఎడిషన్ విజేతను నిర్ణయిస్తుంది. భారత్ గతంలో రెండుసార్లు ఫైనల్‌కు చేరుకుని ఓడిపోయింది. న్యూజిలాండ్ 2021లో ప్రారంభ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకోగా, 2023లో ఆస్ట్రేలియా టెస్ట్ ఛాంపియన్షిప్ ను ఎగరేసుకపోయింది. చూడాలి మరి ప్రస్తుతం పాయింట్స్ పట్టికలో మొదటి స్థానంలో ఉన్న టీమిండియా ముచ్చటగా మూడోసారి ఫైనల్ కి చేరి ఈ సారైనా విజయాన్ని అందుంకుంటుందో లేదో.