NTV Telugu Site icon

Wrestlers: కేంద్ర ప్రభుత్వానికి రెజ్లర్లు అల్టిమేటం.. అరెస్ట్ చేయకపోతే గంగలో పడేస్తాం..

Writelrs

Writelrs

సుమారు నెలన్నర రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తమకు న్యాయం చేయాలని నిరసనకు దిగిన రెజ్లర్లు తమ పోరాటాన్ని తీవ్రతరం చేశారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తున్నారు. బ్రిజ్ భూషణ్ పై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ రెజ్లర్లు సరికొత్త రీతిలో నిరసన చేపట్టాలని నిర్ణయించారు. ఇవాళ (మంగళవారం) ఉదయం చేసిన ప్రకటన ప్రకారం రెజ్లర్లు.. వినేష్ ఫోఘట్, సాక్షి మాలిక్, బజ్ రంగ్ పునియా తదితరులు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు చేరుకున్నారు. పతకాలను గంగానదిలో పడేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెజ్లర్లకు పోలీసులకు మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Also Read : 2000Note: రూ.2000 నోట్ల రద్దు.. పిటిషన్ తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు

తాము సాధించిన పతకాలకు ఎటువంటి అర్థం లేకుండా పోయిందని.. ఆ పతకాలను గంగానదిలో కలిపేస్తామని రెజ్లర్లు ఆవేదన వ్యక్తం చేశారు. రెండ్రోజుల క్రితం పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవం సందర్భంగా.. పార్లమెంట్ వైపు మార్చ్ తీసే క్రమంలో పోలీసులు.. రెజ్లర్లపై వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియా వంటి రెజ్లర్లను పోలీసులు.. ఈడ్చుకెళ్లి పోలీసు వాహనాల్లో ఎక్కించిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. అలాగే దీక్ష కోసం ఇకపై జంతర్‌ మంతర్‌ వద్దకు అనుమతించబోమని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

Also Read : Ambati Rambabu: టీడీపీ మోసాలకు పాల్పడే పార్టీ.. నన్ను ఓడించేందుకు కొత్త వస్తాదుల్ని తెస్తున్నారు

తమ పతకాలను గంగానదిలో పడేస్తామని వెళ్లిన రెజ్లర్లు ఇప్పుడా నిర్ణయంపై వెనక్కి తగ్గారు. ఈ నేపథ్యంలో హరిద్వార్‌లోని గంగానది ఒడ్డున హైడ్రామా కొనసాగింది. రైతు సంఘాల నేత నరేశ్‌ టికాయత్‌ హరిద్వార్‌కు చేరుకుని రెజ్లర్లను సముదాయించారు. వారి వద్ద నుంచి పతకాలను టికాయత్‌ తీసుకున్నారు. ఐదురోజులు వేచి ఉండాలని రెజ్లర్లకు టికాయత్‌ సూచించారు. ప్రభుత్వానికి రైతు సంఘాల నేతలు ఐదు రోజులు గడువిచ్చారు. అలా రైతు సంఘ నేతల సూచనలతో రెజర్లు ఆందోళన విరమించారు. కేంద్ర ప్రభుత్వానికి నలుగు రోజుల పాటు గడువు ఇచ్చారు. నరేశ్‌ టికాయత్‌తో చర్చల అనంతరం రెజ్లర్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు.