Site icon NTV Telugu

WPL 2026: వేలంలో కరీంనగర్ ప్లేయర్‌కు జాక్‌పాట్.. వేలంలో శిఖా పాండే, అరుంధతిలకు భారీ ధర..!

Wpl 2026 Auc

Wpl 2026 Auc

WPL 2026: WPL 2026 వేలం మరోసారి తెలుగు క్రీడాకారిణుల ప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్‌కి చెందిన ఆల్ రౌండర్ అరుంధతి రెడ్డిని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) రూ. 75 లక్షలకు తమ జట్టులోకి తీసుకుంది. మరోవైపు కరీంనగర్‌కు చెందిన శిఖా పాండేకు ఈ వేలంలో జాక్‌పాట్ తగిలినట్లైంది. కేవలం రూ. 40 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన శిఖాను యూపీ వారియర్స్ ఏకంగా రూ. 2.4 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకుంది.

WPL 2026 Unsold Players: అయ్యబాబోయ్.. అన్‌సోల్డ్ లిస్ట్ పెద్దదే సుమీ..!

100కి పైగా అంతర్జాతీయ మ్యాచ్‌ల అనుభవం ఉన్న శిఖా పాండే ఈసారి తొలిసారిగా WPL వేలంలో పాల్గొనడం విశేషం. చివరిసారిగా ఆమె 2023లో నెదర్లాండ్స్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. టీ20ల్లో 56 ఇన్నింగ్స్‌ల్లో 43 వికెట్లు, వన్డేల్లో 55 ఇన్నింగ్స్‌ల్లో 75 వికెట్లు సాధించింది. అనుభవం, ప్రతిభను దృష్టిలో ఉంచుకుని ఫ్రాంచైజీలు బిడ్డింగ్‌లో భారీ ధరలకు ఆటగాళ్లను తమ జట్లలోకి ఆహ్వానించాయి.

Drishyam 3 Rights: కళ్లు చెదిరే ఆఫర్.. పనోరమా స్టూడియోస్‌‌కు ‘దృశ్యం3’ థియేట్రికల్‌ రైట్స్‌

వీరితోపాటు మరో హైదరాబాదీ ప్లేయర్ N క్రాంతి రెడ్డిని 10 లక్షలకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. అలాగే మరో హైదరాబాదీ గొంగడి త్రిషను 10 లక్షలకు సొంతం చేసుకుంది యూపీ వారియర్స్.

Exit mobile version