NTV Telugu Site icon

Tortoise 190th Birthday: ఘనంగా తాబేలు 190వ బర్త్ డే

Jonathan Tortoise File

Jonathan Tortoise File

Tortoise 190th Birthday: తాబేలు జీవితకాలం ఎంతో చాలా మందికి తెలియదు.. అవి 300ఏళ్లు బతుకుతాయని శాస్త్రవేత్తలు చెబుతారు. ఇప్పటి వరకు భూమ్మీద అత్యధిక వయసున్న తాబేలు ఎక్కడుందో.. ఇప్పుడు దాని వయసెంతో తెలుసా.. ఆ తాబేలు పేరు జోనాథన్ దాని వయసు అక్షరాల 190సంవత్సరాలు. భూమ్మీద అత్యధిక వయసున్న ప్రాణిగా జోనాథన్‌ పేరు ప్రపంచ రికార్డుల్లోకి ఎక్కింది. ఇది మగ తాబేలు. ఇటీవలే అది తన 190వ పుట్టిన రోజు వేడుకలను వైభవంగా జరుపుకుంది. ఇక.. సౌత్‌ అట్లాంటిక్‌లోని మారుమూల ద్వీపం సెయింట్‌ హెలెనాలో జోనాథన్‌కు పుట్టిన రోజు వేడుకలకు వేదికైంది.  ఈ ప్రాంతంలోనే ఫ్రెంచ్‌ చక్రవర్తి నెపోలియన్‌.. తన ఆఖరిరోజుల్ని గడిపి 1821లో కన్నుమూశారు. అది ఎప్పుడు పుట్టిందనేది శాస్త్రీయంగా నమోదు చేయనప్పటికీ 1832లో ఇది గుడ్డు నుంచి బయటకు వచ్చి ఉంటుందని.. దానిపై ఉండే డొప్ప ఆధారంగా వయసుపై ఓ అంచనాకి వచ్చారు పరిశోధకులు. తూర్పు ఆఫ్రికా దేశం సీషెల్స్ నుంచి యాభై ఏళ్ల వయసులో జోనాథన్‌ను.. యూకే ఓవర్సీస్‌ సరిహద్దులకు తీసుకొచ్చారు.

Read Also: Bandi Sanjay: ఇప్పుడు రాలేకపోతున్నా.. మళ్లీ తప్పకుండా వస్తా..

ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన తాబేలుగా జీవితం
సెయింట్ హెలెనాలో, జోనాథన్ ఏదో ఒక సెలబ్రిటీ. వృద్ధ జంతువు డేవిడ్, ఎమ్మా, ఫ్రెడ్ అనే మరో మూడు పెద్ద తాబేళ్లతో కలిసి నివసిస్తుంది. వృద్ధాప్యం జోనాథన్‌ను అంధుడిగా, వాసన లేకుండా చేసింది.. కానీ, దాని వినికిడి అద్భుతమైనది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, అతను తన యజమాని చేసే శబ్దాలకు బాగా స్పందిస్తుంది. ఇప్పుడు ఆ తాబేలు అవయవాలు కొన్ని పాడైనప్పటికీ, జోనాథన్ యజమాని, జో హోలిన్స్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌తో మాట్లాడుతూ, జంతువుకు ఇంకా శక్తి పుష్కలంగా ఉందని – ఇది వాతావరణంతో మారుతూ ఉంటుందన్నారు.

Read Also: Revanth Reddy: నన్ను జైల్లో పెట్టి.. నా బిడ్డ లగ్నపత్రికకు పోకుండా చేశారు

1882లో యాభై ఏళ్ల వయసున్న ఈ తాబేలును.. సర్‌ విలియమ్‌ గ్రే విల్సన్‌కు కానుకగా అందించారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన ఆ ద్వీపానికి గవర్నర్‌ అయ్యారు. అప్పటి నుంచి సెయింట్‌ హెలెనా గవర్నర్‌ అధికార భవనంలోని మొక్కల సంరక్షణ కేంద్రంలో ఇది ఉంచబడుతోంది. జోనాథన్‌ బాగోగులు చూసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. తోడు కోసం ఓ ఆడ తాబేలును కూడా తీసుకొస్తారు. జోనాథన్‌ పుట్టినరోజు వేడుకలు ప్రత్యేకంగా నిర్వహించారు. దాని ఫేవరెట్‌ ఫుడ్‌(పండ్లు) అందించడంతో పాటు ప్రత్యేక కేక్‌ను సిద్ధం చేశారు. జోనాథన్‌ పేరు మీద ఓ స్టాంప్‌ను సైతం విడుదల చేశారు. ప్రపంచంలోనే అధిక వయసు ఉన్న భూప్రాణిగా జోనాథన్‌ పేరు ఈ ఏడాది మొదట్లోనే గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల్లోకి ఎక్కింది. జోనాథన్‌ కళ్ల ముందే ప్రపంచ యుద్ధాలు జరిగాయి.