NTV Telugu Site icon

Juliet Rose: అత్యంత అరుదైన గులాబీ.. ధర రూ.112 కోట్లు..!

Juliet Rose

Juliet Rose

Juliet Rose: పువ్వుల్లో గులాబీకి ఉన్న స్థానం చాలా ప్రత్యేకమైనది.. అందకే గులాబీ పువ్వును ఇష్టపడనివారు ఉండరు.. ఇక, ప్రేమికులు అనగానే మొదట గుర్తుకు వచ్చేది గులాబీయే.. ఎందుకంటే.. ప్రియుడు.. తన ప్రియురాలి ముందు తన ప్రేమను వ్యక్తం చేయాలన్నా..? తన ప్రేమను చాటాలన్నా గులాబీ పూలు ఇచ్చే చెప్పేస్తుంటారు.. ఈ ఆచారం ప్రాచీన కాలం నుంచి కొనసాగుతూనే ఉంది.. ఇది వారి ప్రేమను మరింత ధృడంగా చేస్తుందని నమ్ముతారు..

Read Also: Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

అయితే, గులాబీ అనేది రోసా జాతికి చెందినది. పుష్పించే మూడు వందలకు పైగా జాతులు ఉన్నాయి. వేలాది మంది వీటిని సాగు చేస్తున్నారు. చెట్టు కొమ్మలు నిటారుగా పదునైన ముళ్ళను కలిగి ఉంటాయి. గులాబీ సువాసన కలిగిన అందమైన పువ్వు. పువ్వులలో రాణిగా అభివర్ణిస్తాం. గులాబీ పువ్వుల నుండి ఆవిరి ద్వారా తీయబడిన నూనె, గులాబీ అత్తరుని పరిమళ ద్రవ్యాలలో కొన్ని శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. గులాబీ నూనె నుండి తయారయ్యే రోజ్ వాటర్ను ఆసియా దేశాల వంటలలో విరివిగా వాడుతున్నారు. ఒక, గులాబీ పువ్వు ఒక్కో రకాన్ని బట్టి.. ఒక్కో ధర ఉంటుంది.. రూ.10 నుంచి మొదలు కొని వందలు కూడా పలుకుతుంది.. కానీ, ఓ గులాబీ పువ్వు ధర వింటే మాత్రం షాక్‌ అవ్వాల్సిందే..! కోట్లాది రూపాయలు పలుకుతుంది.. ఇంతకీ కోట్లు పలుకుతోన్న ఆ గులాబీ పేరు ఏంటంటారా? అదే జూనియెట్‌ రోజ్‌.. దీని ధర ఏకంగా రూ.112 కోట్లు.. ఈ పువ్వు వికసించడానికి 15 ఏళ్లు పడుతుందట.. అత్యంత ఖరీదైన ఆ గులాబీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం.. కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..