NTV Telugu Site icon

Robot Fightin: ప్రపంచంలోనే తొలిసారి.. రోబోల మధ్య బాక్సింగ్ మ్యాచ్.. ఒకరిపై ఒకరు పంచ్‌ల వర్షం

Robo

Robo

టెక్నాలజీ అద్భుతమైన ఆవిష్కరణలకు నాంది పలుకుతోంది. ఏఐతో వినూత్న ఆవిష్కరణలు ఉద్భవిస్తున్నాయి. తాజాగా ప్రపంచంలోనే తొలిసారిగా రెండు రోబోల మధ్య బాక్సింగ్ మ్యాచ్ జరిగింది. ఇందులో రోబోలు ఒకరినొకరు తన్నుకుంటూ, గుద్దుకుంటూ ఉన్నాయి. ఒకరిపై ఒకరు పంచ్‌ల వర్షం కురిపించుకున్నారు. అచ్చం మానవ బాక్సింగ్ పోటీల మాదిరిగానే జరిగాయి. ఈ 4.25 అడుగుల పొడవైన రోబోల పోటీని టీవీలో కూడా ప్రసారం చేశారు.

Also Read:U16 Davis Cup: ఓడినా సిగ్గు లేదుగా.. ఓవర్ యాక్షన్ చేసిన పాకిస్తాన్ ప్లేయర్..!

ఈ పోటీ పేరు వరల్డ్ రోబోట్ కాంపిటీషన్, ఈ పోటీ ఇటీవలే జరిగింది. ఈ రోబోలను చైనా కంపెనీ యూనిట్రీ రోబోటిక్స్ అభివృద్ధి చేసింది. ఇది అనేక అధునాతన హ్యూమనాయిడ్ రోబోలను తయారు చేయడంపై కృషి చేస్తోంది. చైనాలోని హాంగ్‌జౌ నగరంలో జరిగిన ఈ పోటీలో నాలుగు రోబోలు పాల్గొన్నాయి. అన్ని రోబోలు ఒకే పరిమాణంలో ఉన్నాయి. వాటి ఎత్తు 132 సెం.మీ, బరువు 32 కిలోలు. బాక్సింగ్ రింగ్‌లో పోరాడుతున్న రోబోలను రిమోట్‌తో నియంత్రించారు. దీని కోసం, హ్యూమన్ ట్రైనర్ జాయ్ స్టిక్ సహాయంతో వాటిని నియంత్రించాడు. ఈ మ్యాచ్ చైనా సెంట్రల్ టెలివిజన్‌లో ప్రసారం చేశారు.