Electrical Flight : పర్యవరణ పరిరక్షణకు ప్రపంచదేశాలన్నీ కృషిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే చాలా దేశాలు ఒప్పందాలపై సంతకాలు కూడా చేశాయి. అందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి. ఇప్పటికే ఎలక్ట్రిక్ బైకులు, కార్ల తయారీలో చాలా కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ కూడా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఆటో రంగానికి పరిమితమైన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ఏవియేషన్ రంగానికి కూడా విస్తరించింది. తాజాగా ప్రపంచంలోని మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్‌గా పేరున్న ‘ఆలిస్’ అనే విమానం విజయవంతంగా గగన వీధుల్లో ప్రయాణించింది.
Read Also:Digital Rupee: డిజిటల్ కరెన్సీ వచ్చేస్తోంది.. ఆర్బీఐ కీలక ప్రకటన
ఈవియేషన్ ఎయిర్‌క్రాఫ్ట్ సంస్థ తయారుచేసిన ఈ విమానం వాషింగ్టన్‌లోని గ్రాంట్ కౌంటీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 3,500 అడుగుల ఎత్తుకు ఎగిరింది.దాదాపు 8 నిమిషాల పాటు ఈ విమానం గాలిలో ప్రయాణించింది. మొట్టమొదటి ఉద్గారాల రహిత విమానాన్ని విజయవంతంగా నడిపించామని ఈవియేషన్ సంస్థ అధ్యక్షుడు, సీఈవో గ్రెగోరీ డేవిస్ తెలిపారు. కాగా, అమెరికాకు చెందిన కేప్ ఎయిర్ 75 యూనిట్లు, గ్లోబల్ ఎక్స్ ఎయిర్‌లైన్స్ 50 యూనిట్లకు ఆర్డర్ ఇచ్చాయి. మూడు వేరియంట్లలో 9 సీటర్ కమ్యూటర్ ఒకటి, 6 సీటర్ ఎగ్జిక్యూటివ్ క్యాబిన్ రెండోది, మూడవ ఈ కార్గోను ఈవియేషన్ కంపెనీ తయారుచేయనుంది.
Read Also:Uttarkashi Avalanche: ఉత్తరకాశీ హిమపాతం ఘటనలో 26కు చేరిన మృతుల సంఖ్య
ప్రత్యేకతలు ఇవే..
ఆలిస్ విమానం జీరో ఎమిషన్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. లైట్ జెట్‌లు, హై-ఎండ్ టర్బోప్రోప్స్‌తో పోలిస్తే దీని మెయింటెనెన్స్ కాస్ట్ చాలా తక్కువ. 9 సీటర్ కమ్యూటర్, 6 సీటర్ ఎగ్జిక్యూటివ్ క్యాబిన్, ఈకార్గో అనే మూడు వేరియంట్‌లలో ఇది లభిస్తుంది. ప్యాసింజర్ వెర్షన్‌కు గరిష్టంగా 1,134 కిలోల లోడ్ కెపాసిటీ, ఈకార్గో వెర్షన్‌కు 1,179 కిలోల కెపాసిటీ ఉంది. ఆలిస్ గరిష్టంగా 260 నాట్ల ఆపరేటింగ్ స్పీడ్‌తో ట్రావెల్ చేస్తుంది. అన్ని వేరియంట్లలో ఇద్దరు సిబ్బంది ప్రయాణించే అవకాశం ఉంది. ఎగ్జిక్యూటివ్ క్యాబిన్, ఈకార్గో వేరియంట్స్‌లో లోపలి భాగం మినహా మిగతా అన్నీ కమ్యూటర్ కాన్ఫిగరేషన్‌కు సమానంగా ఉంటాయి.