Trump Canada Venezuela Map: సంచలన నిర్ణయాలతో ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు అగ్రరాజ్యాధిపతి డోనాల్డ్ ట్రంప్. తాజాగా ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఒక ఫోటోను షేర్ చేసి యూరోపియన్ యూనియన్‌లో కలకలం సృష్టించారు. ఈ ఫోటోలో గ్రీన్‌లాండ్, కెనడా, వెనిజులాలను అమెరికా భూభాగాలుగా చిత్రీకరించారు. ఈ ఫోటోలో కెనడా, గ్రీన్‌లాండ్‌లను అమెరికా జెండాలోని ఎరుపు, తెలుపు, నీలం రంగులలో చిత్రీకరించారు. క్యాప్షన్ లేని ఈ పోస్ట్‌ను ట్రంప్ గ్రీన్‌ల్యాండ్‌ను సొంతం చేసుకోవడానికి చేసిన కొత్త ప్రయత్నంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: కొత్త లుక్, ఫీచర్లు, వేరియంట్లతో 2026 Bajaj Pulsar 125 లాంచ్.. ధర ఎంతంటే..!
అమెరికా, ప్రపంచ భద్రతకు ఇది ముఖ్యమైనదని, అందువల్ల డానిష్ స్వయంప్రతిపత్తి ప్రాంతం అయిన గ్రీన్‌లాండ్‌ను ఏ విధంగానైనా అమెరికా సొంత భూభాగంగా చేసుకుంటామని ట్రంప్ పదే పదే చెబుతున్నారు. గతంలో ట్రంప్ ట్రూత్‌లో షేర్ చేసిన ఒక ఫోటోలో.. యూరోపియన్ నాయకులకు యునైటెడ్ స్టేట్స్ కొత్త మ్యాప్‌ను చూపిస్తున్నారు. దీనిలో ట్రంప్ ఉక్రెయిన్ యుద్ధంలో పరిస్థితిని యూరోపియన్ నాయకులతో చర్చిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ చిత్రం AIని ఉపయోగించి రూపొందించారు. ఈ పోస్ట్ తర్వాత ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో గ్రీన్‌లాండ్ ను అమెరికా భూభాగంగా చిత్రీకరించే మరో AI- రూపొందించిన చిత్రాన్ని కూడా పంచుకున్నారు. ఈ చిత్రంలో ట్రంప్, J.D. వాన్స్, మార్కో రూబియోలతో కలిసి ఆర్కిటిక్ ద్వీపంలో అమెరికన్ జెండాను పాతున్నట్లు కనిపిస్తుంది.
గ్రీన్‌లాండ్‌ను అమెరికాలో చేర్చడానికి ట్రంప్ ఆసక్తిగా ఉండటంతో యూరోపియన్ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఫ్లోరిడాలో విలేకరులతో మాట్లాడుతూ.. “మనం దానిని (గ్రీన్‌లాండ్) తీసుకోవాలి. డెన్మార్క్ వారు మంచి వ్యక్తులు, కానీ వారు తమను తాము రక్షించుకోలేరు. వారు అమెరికా పట్ల అంతగా శత్రుత్వం కలిగి ఉంటారని నేను అనుకోను” అని అన్నారు. ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా – చైనా ప్రభావం పెరుగుతోందని, దీనిని ఎదుర్కోవడానికి గ్రీన్‌లాండ్ అమెరికాలో భాగం కావాలని ట్రంప్ అంటున్నారు. ఎందుకంటే డెన్మార్క్ దానిని రక్షించుకోలేకపోతుందని చెప్పారు. ఇంతలో ట్రంప్ విడుదల చేసిన కొత్త యూరోపియన్ దేశాలలో ఆందోళనలను కలిగిస్తుంది. ఫ్రాన్స్‌తో సహా అనేక యూరోపియన్ దేశాలు గ్రీన్‌లాండ్‌ను విలీనం చేసుకునే అమెరికా ప్రయత్నాలను నిరసిస్తున్నాయి. వాస్తవానికి ఇప్పుడు అమెరికా-యూరోపియన్ దేశాల మధ్య ఈ కొత్త మ్యాప్ ఉద్రిక్తతలను మరింత పెంచినట్లు అయ్యిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే టైంలో ట్రంప్‌తో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వ్యక్తిగతంగా సమావేశం అయ్యి, మాట్లాడారు. ఈ సందర్భంగా మాక్రాన్ ట్రంప్‌తో మాట్లాడుతూ.. తన గ్రీన్‌లాండ్ వైఖరిని విరమించుకోవాలని కోరారు. ఈ సంభాషణపై మాక్రాన్ కార్యాలయం ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయనప్పటికీ, ఫ్రెంచ్ అధ్యక్షుడికి దగ్గరగా ఉన్న ఒక వార్తా సంస్థ ట్రంప్ పంచుకున్న ఈ చాట్ సరైనదేనని పేర్కొంది.
