NTV Telugu Site icon

World tallest man : ప్రపంచంలోని పొడవైన వ్యక్తి.. ఎత్తు కొలవాలంటే స్టూల్ ఎక్కాల్సిందే

Tallest Man

Tallest Man

World tallest man : ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వ్యక్తిగా టర్కీకి చెందిన 40 ఏళ్ల సుల్తాన్‌ సేన్‌ పేరు మీద ఇప్పటివరకు గిన్నీస్ రికార్డు ఉంది. అయితే, ఇతడిని దాటేసేందుకు ఘనాకు చెందిన 29 ఏళ్ల వ్యక్తి నెలనెలా తెగ పెరిగిపోతున్నాడు. ఇతని పేరు సులేమనా అబ్దుల్‌ సమీద్‌. అందరిలా కాకుండా సమీద్ ప్రస్తుతం 22 ఏళ్ల వయసులో కూడా వేగంగా పెరుగుతున్నాడు. ఇప్పుడు ఈ విషయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అబ్దుల్ సమేద్‌ ప్రస్తుతం ఎత్తు 9 అడుగుల 6 అంగుళాలకు (2.89 మీటర్లు) చేరినట్లు ఘనాలోని ఒక స్థానిక ఆసుపత్రి చెప్పింది.

Read Also: Chinese Manja : బైకర్ ప్రాణం తీసిన పతంగి మాంజా

అబ్దుల్‌కు జిగాంటిజం (అసాధారణ పెరుగుదల) ఉన్నట్లు కొన్నేళ్ల క్రితం నిర్ధారితం అయింది. ఎత్తుగా ఉండటం వల్ల ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడం కోసం అతను నెలవారీ వైద్య పరీక్షలకు హాజరు అవుతారు. ఇలాగే ఒకసారి వైద్య పరీక్షకు వెళ్లినప్పుడు ఎత్తు కొలిచే స్కేలు (కడ్డీ) పక్కన నిలబడాల్సిందిగా అతన్ని నర్సు కోరారు. అతను దాని పక్కన నిలబడగానే చూసిన నర్సు ఆశ్చర్యపోయారు. ‘‘నువ్వు ఈ స్కేలు కంటే ఎక్కువ ఎత్తు పెరిగావు’’ అని అబ్దుల్‌కు చెప్పారు. అప్పుడు అతని ఎత్తు 7 అడుగుల 4 అంగుళాలు. గిన్నిస్‌లో స్థానం సంపాదించిన సుల్తాన్‌(ఎత్తు 8 అడుగుల 2.8 అంగుళాలు)ను త్వరలోనే దాటేస్తావని అందరూ తెగ పొగిడేశారు. సమీద్‌ ఇంకా ఎత్తు పెరుగుతుండటం గమనార్హం. కాగా ‘మార్ఫాన్‌ సిండ్రోమ్‌గా పిలిచే ఈ జన్యుసంబంధ వ్యాధి కారణంగా తీవ్ర గుండె సమస్యలు తలెత్తుతాయి. మెదడుకు శస్త్రచికిత్స చేసి ఇతని పెరుగుదలను ఆపాల్సి ఉంది’ అని వైద్యులు తెలిపారు.

Show comments