NTV Telugu Site icon

World smallest Rubik cube: ప్రపంచంలోనే అతి చిన్న రూబిక్స్ క్యూబ్.. కానీ కాస్ట్లి గురూ

World's Smallest Rubik's Cube

World's Smallest Rubik's Cube

World smallest Rubik cube: ఒక జపనీస్ బొమ్మల కంపెనీ ప్రపంచంలోనే అతి చిన్న రూబిక్స్ క్యూబ్‌ను పరిచయం చేసింది. ఇది పూర్తిగా పనిచేసే విధంగా ఆరు వైపుల పజిల్‌ను కలిగి ఉంటుంది. అధునాతన మెటల్ ప్రాసెసింగ్ టెక్నాలజీని ఉపయోగించి బందాయ్ కంపెనీకి చెందిన అనుబంధ సంస్థ మెగా హౌస్ కార్పొరేషన్ తయారు చేసింది. ఇది ప్రపంచంలోనే అతి చిన్న అధికారిక రూబిక్స్ క్యూబ్. ప్రతి వైపు సుమారు 0.50 సెం.మీ, ప్రతి చతురస్రం సుమారు 0.16 సెం.మీ x 0.16 సెం.మీ x 0.16 సెం.మీగా ఉంటుంది.

Also Read: Israel Army Chief: హమాస్‌ దాడిని నిలువరించడంలో తాము ఫెయిల్ అయ్యాం..

0.3 గ్రాముల బరువున్న ఈ ప్రపంచ రికార్డు సాధించిన అతి చిన్న రూబిక్స్ క్యూబ్ ధర 777,777 యెన్స్ గా నిర్ణయించారు. అంటే దాదాపు మన దేశ కరెన్సీలో దాదాపు 4.4 లక్షలన్నమాట. భవిష్యత్తులో ఆసియాలోని ఇతర ప్రాంతాలకు విక్రయాలను విస్తరించే యోచనతో గురువారం నుండి కంపెనీ ఆన్‌లైన్ స్టోర్‌లో ఆర్డర్‌లను తీసుకుంటున్నారు. 39 భాగాలతో కూడిన ఈ గేమ్‌ను ప్రామాణిక రూబిక్స్ క్యూబ్ లాగా ఆడవచ్చని కంపెనీ తెలిపింది. 1974లో జనాదరణ పొందిన త్రీ-డైమెన్షనల్ పజిల్ ఆవిష్కరణ 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రూపొందించబడిన ఈ చిన్న క్యూబ్‌ను అభివృద్ధి చేయడానికి నాలుగు సంవత్సరాలు పట్టిందని మెగా హౌస్ తెలిపింది.

Also Read: Malla Reddy and Teegala Krishna Reddy: త్వరలో టీడీపీ గూటికి తీగల.. మరి మల్లారెడ్డి..?

అధునాతన మైక్రోఫ్యాబ్రికేషన్ ద్వారా జపనీస్ హస్తకళను ప్రతిబింబించే ఉత్పత్తిని రూపొందించడంలో మేము విజయం సాధించామని మెగాహౌస్ ప్రెసిడెంట్ అకిహిరో సాటో విలేకరుల సమావేశంలో అన్నారు. టాయ్ మేకర్ తాజా మినీ క్యూబ్ ఆగస్ట్ 23న గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా అతి చిన్న తిరిగే పజిల్ క్యూబ్‌గా గుర్తించబడింది.

Show comments