Site icon NTV Telugu

D Gukesh: ప్రపంచ ఛాంపియన్‌ గుకేశ్‌కు ప్రైజ్‌మనీ ఎంతంటే?

D Gukesh Prize Money

D Gukesh Prize Money

ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ 2024 విజేతగా దొమ్మరాజు గుకేశ్‌ నిలిచాడు. గురువారం జరిగిన చివరి రౌండ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్, చైనా స్టార్ డింగ్ లిరెన్‌ను ఓడించి విశ్వ విజేతగా నిలిచాడు. దాంతో ప్రపంచ చెస్ ఛాంపియన్‌ టైటిల్ గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా (18 ఏళ్ల 8 నెలల 14 రోజులు) రికార్డు సాధించాడు. అంతకుముందు గారీ కాస్పరోవ్ 22 ఏళ్ల 6 నెలల 27 రోజుల వయస్సులో ఛాంపియన్‌గా నిలిచాడు.

Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీ.. ఒకే ఒక్క సెంచరీ! ఇదే చివరి అవకాశం

ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ గెలిచిన రెండో భారతీయుడిగా డి గుకేశ్ నిలిచాడు. విశ్వనాథన్ ఆనంద్ అయిదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. విజేతగా నిలిచిన గుకేశ్‌కు ట్రోఫీతో పాటు రూ.11.45 కోట్ల నగదు బహుమతి దక్కింది. రన్నరప్‌ లిరెన్‌ రూ.9.75 కోట్లు సొంతం చేసుకున్నాడు. ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ మొత్తం ప్రైజ్‌మనీ రూ.21.17 కోట్లు. ఒక గేమ్‌ గెలిచిన ప్లేయర్‌కి రూ.1.69 కోట్లు దక్కుతాయి. ఈ క్రమంలో మూడు గేమ్‌లు నెగ్గిన గుకేశ్‌కు రూ.5.07 కోట్లు, రెండు గేమ్‌లు గెలిచిన లిరెన్‌కు రూ.3.38 కోట్లు దక్కాయి. మిగిలిన ప్రైజ్‌మనీని సమానంగా పంచారు.

Exit mobile version