Womens T20 World cup 2024 Semi finals: మహిళల టి20 ప్రపంచ కప్ 2024 నాలుగు సెమీ-ఫైనలిస్ట్ జట్లు తెలిసిపోయాయి. ముందుగా గ్రూప్-A నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు సెమీఫైనల్‌కు చేరాయి. ఇప్పుడు గ్రూప్-B లోని మిగిలిన రెండు జట్లు కూడా సెమీఫైనల్‌లో తమ స్థానాన్ని ఖాయం చేసుకున్నాయి. పాకిస్థాన్ ఓటమితో టీమ్ ఇండియా టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. గ్రూప్-Aలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తర్వాత గ్రూప్-Bలో వెస్టిండీస్, దక్షిణాఫ్రికా సెమీఫైనల్‌కు చేరాయి. ఇంగ్లండ్‌పై వెస్టిండీస్ విజయం సాధించి సెమీ ఫైనల్‌కు చేరుకుంది. ఓటమితో ఇంగ్లండ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. వెస్టిండీస్ విజయంతో దక్షిణాఫ్రికా కూడా సెమీస్‌లో చోటు దక్కించుకుంది. మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా దక్షిణాఫ్రికా స్థానం సంపాదించింది.
IPPB Recruitment 2024: ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌లో GDS డైరెక్ట్ రిక్రూట్‌మెంట్
దింతో మహిళల T20 ప్రపంచ కప్ 2024 మొదటి సెమీ-ఫైనల్ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య గురువారం అక్టోబర్ 17న, దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఆ తర్వాత షార్జాలోని షార్జా క్రికెట్ స్టేడియంలో వెస్టిండీస్, న్యూజిలాండ్ మధ్య రెండో సెమీఫైనల్ జరగనుంది. దీని తరువాత, ఫైనల్ మ్యాచ్ ఆదివారం అక్టోబర్ 20న జరుగుతుంది. ఇందులో సెమీ-ఫైనల్ గెలిచిన రెండు జట్లు టైటిల్ కోసం మైదానంలో తలపడనున్నాయి.
Election : మహిళలు బురఖా ధరించి ఓటు వేయొచ్చా.. దీనిపై ఎన్నికల కమిషనర్ ఏమన్నారంటే ?
ఇక పేలవమైన ప్రదర్శన కారణంగా టీమ్ ఇండియా మహిళల టీ20 ప్రపంచకప్ నుండి నిష్క్రమించాల్సి వచ్చింది. టోర్నీలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా టోర్నీని ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లోనే భారత జట్టు 58 పరుగుల తేడాతో భారీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత పాకిస్థాన్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీం ఇండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించి టోర్నీలో భారత్‌కు తొలి విజయం అందుకుంది. అయితే., ఆ తర్వాత జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై టీమిండియా 82 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత గ్రూప్ దశలో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి మ్యాచ్‌లో టీమిండియా 9 పరుగుల ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ ఓటమితో టీమ్ ఇండియా టీ20 ప్రపంచకప్ 2024 నుండి నిష్క్రమించాల్సి వచ్చింది.