Site icon NTV Telugu

WPL 2023: విమెన్స్ లీగ్ ప్రారంభం ఆరోజే..ఐపీఎల్ ఛైర్మన్ ప్రకటన

Wpl Schedule 11

Wpl Schedule 11

విమెన్స్ ఐపీఎల్ కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 15 ఏళ్లుగా మెన్స్ లీగ్ అలరిస్తుండగా..విమెన్స్ లీగ్ కూడా ఇలాగే సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన మీడియా హక్కులు, ఫ్రాంఛైజీల కోసం వేసిన బిడ్లలో రికార్డులు క్రియేట్ చేసిన ఈ లీగ్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ గుడ్ న్యూస్ చెప్పారు. మార్చి 4 నుంచి 26 వరకూ ముంబైలో ఈ టోర్నీ జరుగుతుందని వెల్లడించారు. ముంబైలోని బ్రబౌన్స్ స్టేడియం, డీవై పాటిల్ స్టేడియాలలో ఈ లీగ్ మ్యాచ్‌లు నిర్వహిస్తామని తెలిపారు. తొలి మ్యాచ్‌లో అహ్మదాబాద్ ఫ్రాంఛైజీ-ముంబై ఇండియన్స్ టీమ్ పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read: Aaron Finch: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆరోన్ ఫించ్

ఇక ముంబైలోనే ప్లేయర్స్ వేలం జరగనున్నట్లు కూడా ధుమాల్ స్పష్టం చేశారు. ఈ వేలం ఫిబ్రవరి 13న జరగనుంది. విమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఫిబ్రవరి 12న ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ జరగనుండగా.. మరుసటి రోజే వేలం జరుగుతుంది. ఐదు ఫ్రాంఛైజీల అమ్మకం ద్వారా రూ.4,670 కోట్లు, మీడియా హక్కుల వేలం ద్వారా రూ.951 కోట్లు బీసీసీఐకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండింటి ద్వారా ప్రపంచంలో ఐపీఎల్ తర్వాత రెండో అతిపెద్ద టీ20 లీగ్‌గా డబ్ల్యూపీఎల్ నిలిచింది. ప్లేయర్స్ వేలం కోసం సుమారు 1500 మంది ప్లేయర్స్ రిజిస్టర్ చేసుకోగా.. ఫైనల్ లిస్ట్ ఈ వారం చివర్లోపు వచ్చే అవకాశం ఉంది. ఒక్కో టీమ్ కు ప్లేయర్స్ కొనుగోలు కోసం రూ.12 కోట్ల పరిమితి విధించారు. ఒక్కో టీమ్ కనీసం 15 మంది, గరిష్ఠంగా 18 మందిని కొనుగోలు చేయొచ్చు. డబ్ల్యూపీఎల్ తొలి సీజన్‌లో మొత్తం 22 మ్యాచ్‌లు ఉంటాయి. లీగ్ స్టేజ్‌లో టాప్ ర్యాంక్‌లో నిలిచిన టీమ్ నేరుగా ఫైనల్ చేరుతుంది. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన టీమ్స్ ఫైనల్ బెర్త్ కోసం పోటీ పడతాయి.

Also Read: Babu Mohan: బీజేపీ కార్యకర్తపై బాబుమోహన్ బూతుపురాణం

Exit mobile version