Site icon NTV Telugu

Star Vanitha: వనిత టీవీలో మరో సరికొత్త కార్యక్రమం.. ఇక పండగే..

Star Vanitha

Star Vanitha

Star Vanitha: మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన తొలి తెలుగు చానెల్‌ వనిత టీవీ.. ఇప్పటికే ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలను అందిస్తోంది.. పొలిటికల్‌ న్యూస్‌, ఎంటైర్మెనెంట్‌, ఈవెంట్లు, వంటలు, ఫన్నీ ప్రోగ్రామ్స్‌, హెల్త్‌ ప్రోగ్రామ్స్‌, అవేర్‌నెస్‌ కార్యక్రమాలు, దిల్‌దార్‌ వార్తలు.. ఇలా ఎన్నో కార్యక్రమాలతో ఇంటిల్లిపాదిని ఎంటైర్‌టైన్‌ చేస్తోంది.. ఆలోచింపజేస్తోంది. అమూల్యమైన విషయాలను అందిస్తోంది వనిత టీవీ.. అంతే కాదు.. జానపధ కార్యక్రమాల్లోనూ తన కంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది..

ఇప్పుడు మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది వనిత టీవీ.. ‘స్టార్‌ వనిత’ పేరుతో రూపొందిస్తున్న ఈ కార్యక్రమం.. త్వరలోనే వనిత టీవీలో ప్రసారం కానుంది.. ఈ సందర్భంగా ఆ ప్రోగ్రామ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదలైంది.. ఆ ప్రోమో ప్రకారం.. కొందరు సెలక్ట్‌ చేసిన మహిళలతో వివిధ రకాల గేమ్స్‌ ఆడిస్తారు.. పాటలు పాడిస్తారు.. డ్యాన్స్‌లు చేయిస్తారు.. విజేతలకు బహుమతలు కూడా అందిస్తారు.. ఇక, ఈ కార్యక్రమానికి ప్రముఖ యాంకర్‌ శ్యామల నేతృత్వంలో నిర్వహిస్తోంది వనిత టీవీ.. ఆ ప్రోమోను మీరు కూడా చేసేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..

Exit mobile version